ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనాపై రాజకీయం ఎక్కువైపోయింది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు ఇదే అంశంపై ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. అయితే ఈ కరోనా వైరస్ కట్టడి చేయడంలో వైసీపీ ప్రభుత్వం మంచిపని తీరు కనబరుస్తున్న టీడీపీ నేతలు విమర్శలు చేయడం ఆపడం లేదు. అలాగే కరోనా వ్యాప్తి అరికట్టేందుకు చంద్రబాబు మంచి సూచనలు, సలహాలు ఇచ్చిన, వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. తిరిగి బాబుపైనే విమర్శలు చేస్తున్నారు. బాబు వైరస్ కు భయపడి హైదరాబాద్ లో దాక్కున్నారని వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు.

 

అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే... చంద్రబాబు, వైసీపీ ప్రభుత్వంపై నిర్మాణాత్మకమైన విమర్శలు చేస్తున్నారు. అలాగే విలువైన సలహాలు ఇస్తున్నారు. కానీ వైసీపీ నేతలు మాత్రం వ్యక్తిగతమైన విమర్శలు చేస్తున్నారు. ఇదే విషయంపై తెలుగు తమ్ముళ్లు కూడా సీరియస్ గా ఉన్నారు. వైసీపీ నేతలు అనవసరంగా నోరు పారేసుకుంటున్నారని మండిపడుతున్నారు.

 

తాజాగా కూడా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన ఓ కామెంట్ పై టీడీపీ కార్యకర్తలు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.చంద్రబాబు సంపాదించిన వేల కోట్ల రూపాయలు ఈ విపత్కర పరిస్ధితుల్లో ప్రజలకు పంచి పెట్టాలని బాలినేని అంటున్నారని, ఇక అదే పని జగన్ కూడా చేయొచ్చు కదా అని టీడీపీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. జగన్ దగ్గర లక్ష కోట్లు ఉన్నాయి కదా, అవి ప్రజలకు పంచమని చెబుతున్నారు.

 

ఇదే సమయంలో అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ కూడా మరి దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నారని, అవి ఏ మాత్రం సమంజసం కాదని అంటున్నారు. కాగా, రాష్ట్రానికి పట్టిన పొలిటికల్‌ వైరస్‌ చంద్రబాబు, ఈ వైరస్‌కి 40 ఏళ్లుగా మందు దొరకలేదని మాట్లాడారు. దీనిపై టీడీపీ కార్యకర్తలు స్పందిస్తూ, ఏదైనా రాజకీయం పరంగా విమర్శలు చేయాలనీ, అలా కాకుండా వ్యక్తిగతంగా ఇలా వైరస్ అంటూ మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు. అయినా వైసీపీ నేతల సంస్కారం అలాంటిదిలే అని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: