లాక్ డౌన్ షాకుల ప‌రంప‌ర కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. క‌ఠిన‌మైన నిబంధ‌న‌ల‌తో వాహ‌నాలు రోడ్డెక్క‌ని ప‌రిస్థితి. దీంతో చాలామంది అత్యవసరమైతే తప్ప‌ బైకులు, కార్లను బయటకు తీయడం లేదు. అయితే, తాజాగా దీనికి సంబంధించి మ‌రో ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. మరికొన్నిరోజులు పొడిగించే అవకాశం ఉండ‌డంతో వాహ‌నాల‌ను తిప్ప‌క‌పోతే పాడైపోయే అవ‌కాశం ఉందని నిపుణులు వెల్ల‌డించారు. ఎక్కువ కాలం వాహనాల్లోని ఇంజిన్, బ్యాటరీ, బ్రేకులు, టైర్లు దెబ్బతినే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు.

 

ఎక్కువ కాలం వాహ‌నాల‌ను వాడ‌క‌పోవ‌డం వ‌ల్ల అనేక న‌ష్టాలు ఉన్నాయ‌ని, నెలల తరబడి ఇంట్లోనే బండ్లను పార్క్ చేసి ఉంచితే...వాహ‌నాల సామర్థ్యం దెబ్బతినే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. వాహనాలు బయటకు తీయనప్పుడు...ఇందనం ఆదా అవుతుందని పెట్రోల్, డీజిల్ పోయడమెందుకులే అనుకుంటారని కానీ అది స‌రైంది కాద‌ని చెప్తున్నారు. బండ్లను ఎండలో ఉంచకండి.. ఇందనం వేడికి ఆవిరయ్యే అవకాశం ఉంది. బ్యాటరీతో నడిచే వాహనాలను రోజులో కొంతసేపు అయినా బయటకు తీసి నడపాలని లేదంటే బ్యాటరీలు దెబ్బతినే అవకాశం ఉందని చెప్తున్నారు. ద్విచక్ర వాహనాలను స్టార్ట్ చేసేటప్పుడు తొలుత సెల్ఫ్ సార్ట్ కంటే కిక్ స్టార్ట్ చేయడం మంచిది. టైర్లలో గాలి కూడా పోతుంది. వాహనాలపై దుమ్మ దూళి చేరకుండా ఉండేందుకు కవర్లను కప్పి ఉంచాలి. లాక్ డౌన్ నిబంధనలకు అనుగుణంగా ఇంటి ఆవరణలోనే కాసేపు బండిని అటు ఇటు తిప్పాలి. లేదంటే ఇంజిన్ స్టార్ట్ చేసి ఉంచ‌డం మంచిదని అంటున్నారు.

 

ఇదిలాఉండ‌గా,  క‌రోనా క‌ట్ట‌డి కోసం దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను వ‌చ్చే మూడ‌వ తేదీ వ‌ర‌కు పొడ‌గించిన విష‌యం తెలిసిందే. కానీ ఈనెల 20వ తేదీ నుంచి జాతీయ ర‌హ‌దారుల‌పై టోల్ రుసుమును వసూల్ చేయ‌నున్నారు.  తొలుత ప్ర‌క‌టించిన 21 రోజుల లాక్‌డౌన్ స‌మ‌యంలో.. అత్య‌వ‌స‌ర సర్వీసుల‌కు వెస‌లుబాటు క‌ల్పించేందుకు టోల్ ఫీజు ఎత్తివేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: