జగన్ ప్రభుత్వంపై టీడీపీ నేతల విమర్శల వర్షం కురుస్తూనే ఉంది. ఓ వైపు జగన్ ప్రభుత్వం కరోనా వ్యాప్తిని అరికట్టడానికి తీవ్రంగా కృషి చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలని ఆదుకుంటున్నారు. అయితే జగన్ ప్రభుత్వం ప్రజల కోసం ఎంత కష్టపడుతున్న, టీడీపీ నేతలు విమర్శలు చేయడం ఆపడం లేదు. కరోనాని అరికట్టడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందని, కరోనా కేసుల్ని దాచిపెడుతున్నారని, ప్రజలకు సాయం చేయట్లేదని విమర్శలు చేస్తున్నారు.

 

ఈ క్రమంలోనే మాజీ మంత్రి, టీడీపీ నాయకురాలు భూమా అఖిలప్రియ కూడా జగన్ లక్ష్యంగా మాటల తూటాలు పేల్చారు. ప్రజలకు సీఎం జగన్ వెయ్యి రూపాయలు ఇచ్చారని, మరి కేంద్రం ఇచ్చిన రూ.2,354 కోట్లను ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రం కోసం ఐదేళ్లలో చంద్రబాబు రూ.26 వేల కోట్ల అప్పులు చేస్తే.. సీఎం జగన్ ఏడాదిలోనే రూ. 72 వేల కోట్ల అప్పులు చేశారని విమర్శించారు.

 

ఇక ఇక్కడ భూమా అఖిలప్రియ అన్ని లాజిక్ లు లేని పాయింట్లనే చెప్పినట్లు అర్ధమవుతుంది. ఎందుకంటే రూ. వెయ్యి రూపాయలు ఎవరు ఇస్తున్నారనేదానిపై  వైసీపీ నేతలు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఎవరు ఇచ్చినా ఆ డబ్బులు మాత్రం ప్రజలవే అని స్పష్టంగా చెప్పారు. పైగా కేంద్రం నుంచి, రాష్ట్రానికి ఎన్ని నిధులు రావాలో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు.

 

అలాగే అప్పులు గురించి వస్తే, గత ఐదేళ్ళలో చంద్రబాబు ఏ స్థాయిలో అప్పులు చేసి, ప్రజలకు తిప్పలు తెచ్చారో అందరికి తెలుసు. దాదాపు లక్ష కోట్ల వరకు అప్పులు చేసారు. ఇంకా లక్ష కోట్ల వరకు బిల్లుల్ని జగన్ ప్రభుత్వం నెత్తి మీద పెట్టారు. ఇక ఆ విషయం గురించి అంతా తెలిసి కూడా, బాబు 26 వేల కోట్ల మాత్రమే అప్పు చేసారని చెప్పడం విడ్డూరంగా ఉంది. పైగా జగన్ 72 వేల కోట్లు అప్పులు చేసారని చెబుతున్నారు. అసలు సంవత్సరం కూడా కాకుండానే అన్ని వేల కోట్లు ఎలా అవుతాయో ఆమెకే తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: