క‌రోనా వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు మ‌న ప్ర‌భుత్వాలు క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. అందులో ఒక‌టి లాక్‌డౌన్‌. ఇవేమీ నిబంధ‌న‌లు లేని దేశాల్లో  క‌రోనా వైర‌స్ పంజా విసురుతున్న‌ది. కరోనా మహమ్మారి వ్యాపించకుండా నిరోధించడంలో ఎదురవుతున్న సవాళ్లన్నిటినీ జయిస్తూ ముందుకు సాగుతున్న ప్రజలు ఈ పోరాటాన్ని చాలా ఓపిగ్గా, సమైక్యంగా కొనసాగిస్తున్నారు. లాక్‌డౌన్‌ ప్రారంభమైనప్పుడు భారతదేశం లాంటి దేశంలో ఇది సాధ్యమేనా అనే అనుమానం వచ్చింది. కాగా, తెలంగాణ‌లో రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌ పటిష్ఠంగా కొనసాగుతోంది. నిబంధనలు అతిక్రమించి బయటకు వస్తున్నవారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో, జిల్లాల వారీగా చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి 24 గంటల నిఘా కొనసాగిస్తున్నారు. అత్యవసర సేవలు, పనుల కోసం వెళ్లాల్సిన వారిని అనుమతి ఇస్తున్నారు. 

 

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా లక్షకు పైగా వాహనాలను సీజ్‌ చేశారు. మొత్తం 44,787 కేసులు నమోదు చేసి 20,300 మందిని అరెస్టు చేశారు. కంటైన్మెంట్‌ జోన్లుగా ప్రకటించిన 259 ప్రదేశాల్లో నిఘాను మరింత పెంచారు. కంటైన్మెంట్‌ జోన్లలోనివారు బయటికి వెళ్లకుండా, బయటి వ్యక్తులు లోనికి రాకుండా కాపాలా కాస్తున్నారు. ఎప్పటికప్పుడు సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా, కరోనా వ్యాధిగ్రస్థులకు చికిత్స అందిస్తున్న దవాఖానలు, క్వారంటైన్‌ సెంటర్ల వద్ద బందోబస్తును ముమ్మరం చేశారు. డాక్టర్లకు పూర్తి రక్షణ ఇస్తున్నామని, అలాగే క్వారంటైన్‌ సెంటర్ల నుంచి ఎవరూ బయటకు రాకుండా, వారి బంధువులు, ఇతరులు వారి దగ్గరకు వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకొంటున్నారు.

 

భార‌త‌దేశంలోని లాక్‌డౌన్ విష‌యంలో ప‌లు దేవాలు అభినందిస్తున్నాయి. 130 కోట్ల మంది ప్రజలు ఒక తాటిపై నిలిచి ఈ మహమ్మారిపై పోరాటం చేయడం ప్రపంచ చరిత్రలో కనీవినీ ఎరగనిది. భారతదేశంలాంటి దేశంలో ఇంత ఐకతమత్యం, సంఘీభావం ఎలా సాధ్యమైంది అని రాబోయే తరాలు ఆశ్చర్య పోతాయనడంలో సందేహం లేదు. ప్ర‌జ‌ల ఆలోచ‌న కారణంగానే ఇది సాధ్యమవుతోందని ప‌లువురు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: