దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. వైరస్ దేశవ్యాప్తంగా వేగంగా పంజా విసురుతోంది. ఇప్పటివరకు దేశంలో 14,792 మంది వైరస్ భారీన పడ్డారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో ఒకే కుటుంబంలో 26 మంది కరోనా వైరస్ భారీన పడ్డారు. దేశంలో ముంబై నగరం తరువాత ఢిల్లీలోనే అధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు 71 ప్రాంతాలను ఢిల్లీలో కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. 
 
ఈరోజు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జహంగిర్‌ పురి ప్రాంతంలో ఒకే కుటుంబంలోనే 26 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు తెలిపారు. దీంతో ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్ గా గుర్తించింది. కేజ్రీవాల్ ప్రజలు లాక్ డౌన్ నిబంధనలను పాటించాలని సూచించారు. కంటన్మెంట్ జోన్లుగా ప్రకటించిన ప్రాంతాల్లో ప్రభుత్వం ప్రజలను పూర్తిగా ఇళ్లకే పరిమితం చేస్తోంది. 
 
నిత్యావసర వస్తువులను, ఇతర వస్తువులను ప్రభుత్వమే ప్రజల ఇళ్లకు సరఫరా చేస్తోంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కొత్త కేసులు నమోదు కాకుండా చర్యలు చేపడుతోంది. ఢిల్లీలో కరోనా కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. మరోవైపు దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉండటంతో కేంద్రం మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ ను పొడిగించింది. 
 
ప్రభుత్వం లాక్ డౌన్ పొడిగించడంపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లాక్ డౌన్ పొడిగించడం మంచి నిర్ణయమే అయినప్పటికీ ప్రభుత్వం పేద, మధ్య తరగతి వర్గాలకు ప్రయోజనం చేకూరేలా కీలక నిర్ణయాలు తీసుకుంటే బాగుండేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు దేశంలో కరోనా విజృంభిస్తే మే 3వ తేదీ తరువాత కేంద్రం మరోసారి లాక్ డౌన్ పొడిగించే అవకాశం ఉందని తెలుతోంది. మే 3వ తేదీ తరువాత కేంద్రం లాక్ డౌన్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: