కరోనా వైరస్ ఈ పేరు చెబితే చంటి పాప నుంచి పండు ముదుసలి వరకూ అంతా వణికిపోవాల్సిందే. కరోనా మహమ్మారి సైలెంట్ కిల్లర్. అంతే కాదు ఒకేసారి వందలాది, వేలాది మందిని పొట్టన పెట్టుకునే ప్రాణాంతకి. దానికి ఇపుడు వాక్సిన్ లేదు. వస్తే ఒక వేళ రేపో మాపో రావచ్చు. 

 


మరి కరోనాను మించిన వైరస్ భవిష్యత్తులో వస్తే దాని మాటేంటి. అపుడు కూడా మానవాళి పరిస్థితి ఏంటి. నిజానికి కరోనా బయో వార్ కి క్రియేట్ చేసిందని అనుమానాలు ఉన్నాయి. అవి ఎప్పటికీ అలాగే ఉంటాయి కూడా ఎందుకంటే ఎవరూ బయటపెట్టరు, పెట్టలేరు కూడా. చైనా లోని  వూహాన్  ల్యాబ్ లో నుంచి బయటపడినదే ఈ కరోనా భూతమని అంటున్న వారూ ఉన్నారు. కానీ అనుమానాలే అన్నీ, రుజువులు ఎక్కడా లేవు. 

 

సరే ఇది ఎలా ఉందంటే ప్రపంచం బయోవార్ వస్తే ఎలా గడగడలాడిపోతుందా అని చూడడానికి చిన్న శాంపిల్ టెస్ట్ గా ఉందని శాస్తవేత్తలు, నిపుణులు  అంటున్నారు. నిజంగా బయో వెపన్ ని ఉపయోగించాలనుకుంటే ఇంతకన్నా పవర్ ఫుల్ గా వాడుతారు. దానికి మరణమే తప్ప కోలుకొవడం అన్నది ఉండదు.

 

మనుషులు మొత్తం పిట్టల్లా రాలిపోతారంటే. మూడవ ప్రపంచ యుధ్ధం వస్తుందని అంతా ఇప్పటిదాకా  అనుకున్నారు. దాని కోసం ఎన్నో ఆయుధాలు దాచిపెట్టుకున్నారు. అన్న వస్త్రాలను పక్కన పెట్టి అణు అస్త్రాలను  దగ్గర పెట్టుకున్నారు. గుట్టలుగా పడి ఉన్నా అణ్వాయుధాలు చేయలేని పనిని ఇపుడు ఒక్క కరోనా  చేసేస్తోంది. 

 

ప్రపంచం మొత్తం మీద కలుపుకుని లక్షల్లో ప్రాణాలను లాగేసింది. ఇది ఇప్పటికీ అనుమానమే. ఇది ఒక లిట్మస్ టెస్ట్ లాంటిది. ఇది విజయవంతమైంది. 800 కోట్ల మానవాళి పేదా గొప్పా తేడా లేకుండా  భీతిల్లిపోయింది. దారీ తెన్నూ లేక పరుగులు తీస్తోంది. సరిగ్గా ఇపుడు మళ్ళీ కొన్ని దేశాలకు ఈ రకమైన ఆలోచన పుట్టవచ్చు.

 

బయో వెపన్ కోసం ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అవి మరింత ఊపందుకోవచ్చు. అదే కనుక జరిగితే మానవాళి మొత్తం వినాశనం ఎంతో దూరంలో లేదు. మనిషిని మనిషి చంపుకోవడం దేనికి అంటే రాజ్యాధికారం. ఆధిపత్యం కోసమే. అది చరిత్ర చెప్పిన పాఠం. ఒకనాడు కత్తులతో యుధ్ధాలు జరిగేవి, తరువాత తుపాకులు, ఆ తరువాత అణు ఆయుధాలు, ఇపుడు బయో వెపన్. అదే జీవాయుధాలతోనే ప్ర‌త్యర్ధుల కధకు అతి పెద్ద చెక్.  ఇపుడూ అదే జరుగుతోంది. 

 

అందువల్ల ఇపుడు బేలగా ఒక్కగానొక్క కరోనా  వైరస్ గురించే తలచుకుని విశ్వ  మానవాళి యావత్తు  భయపడుతోంది. పడరాని పాట్లు పడుతోంది. ఇందులో మనిషి  విజయం సాధించినా ముందు ముందు మరిన్ని వైరస్ లు రెచ్చిపోవడం ఖాయం. అవి మానవుడిలోని దానవుడు తయారు చేసే బయో వెపన్లూ కావచ్చు. ఏం జరుగుతుందో చూడడమే  మనిషి వంతు ఇపుడు. ఒకవేళ జీవాయుధాలతో దాడి జరిగితే మనిషి ఇక ఉంటాడా. ఖేల్ ఖతమే.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: