భార‌త్‌పై క‌రోనా త‌న ప్ర‌తాపాన్ని చూపుతూనే ఉంది. శనివారం సాయంత్రం 5 గంటల వరకు దేశ వ్యాప్తంగా 14,792 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఒక‌ వెల్లడించింది. కొవిడ్‌ -19తో పోరాడి 2015 మంది కోలుకోగా.. 488 మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. దేశవ్యాప్తంగా 23 రాష్ట్రాల్లో 47 జిల్లాల్లో పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తోందన వివరించింది. 45 జిల్లాల్లో 14 రోజుల నుంచి ఒక్క కరోనా పాజిటివ్ కేసులు కూడా నమోదు కాలేదని తెలిపింది. ఇదిలా ఉండ‌గా మ‌హారాష్ట్రలో క‌రోనా ప్ర‌ళ‌యం సృష్టించేందుకు సిద్ధ‌మ‌వుతోంది. దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో అత్యధికంగా 3,323 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 


ఈ ఒక్క రాష్ట్రంలోనే ఇప్ప‌టి వ‌ర‌కు 201 మంది ఇప్పటి వరకు మరణించారు. దిల్లీలో 1,707 కేసులు నమోదైతే వారిలో 42 మంది ప్రాణాలు కోల్పోయిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. తమిళనాడులో 1,323 మంది ఈ వైరస్‌ బారిన పడగా.. 283 మంది కోలుకున్నారు. 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మధ్యప్రదేశ్‌లో ఇప్పటి వరకు 1,355 కేసులు నమోదయ్యాయి. 69 మరణించారు. మరో 69 మంది కోలుకున్నారు. రాజస్థాన్‌లో 1,229 మందికి కరోనా సోకగా..183 మంది డిశ్చార్జ‌య్యారు. అయితే 11 మంది మరణించారు. గుజరాత్‌లో 1272 మందికి కరోనా సోకింది. రాష్ట్రంలో 48 మరణాలు సంభవించాయి.


ఇక ఈశాన్య భార‌త‌దేశ రాష్ట్ర‌మైన నాగాలాండ్‌లో ఒక్క కరోనా కేసు కూడా న‌మోదు కాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇక్కడి కరోనా బాధితుడిని అసోంకు తరలించడంతో ఈ రాష్ట్రంలో ప్రస్తుతం ఒక్క కేసు కూడా లేకపోవడం గమనార్హం. ఇవి కాక అరుణాచల్‌ ప్రదేశ్‌ (1), గోవా (7), మణిపూర్‌ (2), మిజోరాం (1), పుదుచ్చేరి (7), త్రిపుర (2)లో కేసులు న‌మోద‌య్యాయి. ఇదిలా ఉండ‌గా  ఢిల్లీలోని నిజాముద్దీన్ జరిగిన మత ప్రార్థనలలో విదేశాల నుంచి వచ్చిన మత ప్రచారకులతోపాటు రోహింగ్యాలు కూడా పాల్గొన్నారని కేంద్ర నిఘా వర్గాలు గుర్తించడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. కేంద్రం హెచ్చరికలతో హైదరాబాద్ పరిధిలోని రోహింగ్యాల వివరాలను రాష్ట్ర పోలీసులు సేకరిస్తున్నారు.

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: