కరోనా వైరస్ వల్ల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న లాక్ డౌన్ నిర్ణయం పేద వారితో పాటు కొన్ని రంగాలలో కూడా ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్ వల్ల మనిషి జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఒకరితో ఒకరు చెయ్యి పట్టుకుని మాట్లాడుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఒక విధంగా చెప్పాలంటే ఆప్యాయత గా మనుషులు జీవించలేని రోజులు ముందు ముందు ఉన్నాయి అని చెప్పవచ్చు. ఇలా ఉండగా ఈ వైరస్ వల్ల సినిమా రంగం బాగా నష్టపోయిందని చెప్పవచ్చు. ముఖ్యంగా సినిమా థియేటర్లు వ్యాపారం చేసే వారికి భయంకరమైన లాస్ కరోనా వైరస్ వల్ల రావడం జరిగింది.

 

పైగా వేసవి సీజన్ కావడంతో …. చాలా సినిమాలు రిలీజ్ అవ్వడానికి  రెడీ అయినా గాని కరోనా ఎఫెక్ట్ తో అన్నీ ఆగి పోయాయి. అయితే ప్రస్తుత పరిణామాలను బట్టి చూస్తుంటే... కరోనా వైరస్ ఎక్కువగా చల్లగా ఉండే ప్రాంతాలలో చాలా బలంగా మనిషిపై పని చేస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు. కరోనా దెబ్బతో ప్రజలు కూడా సినిమా ధియేటర్ లోకి వెళ్ళటానికి పెద్దగా ఇప్పటి నుండే ఆసక్తి చూపడం లేదు.

 

దీంతో రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న థియేటర్ల యజమానులు, ప్రేక్షకులను థియేటర్లకు తీసుకురావడానికి సరికొత్త ఆలోచనలు చేస్తున్నారు. కేంద్రం నుండి అనుమతులు వచ్చిన వెంటనే సినిమా టికెట్ రేట్ సగానికి ఇవ్వాలని … ఇంటర్వెల్ లో సమోసాలు కూడా ఫ్రీ గా ఇవ్వాలని థియేటర్ల యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విధంగానైనా థియేటర్ వ్యాపారాన్ని కాపాడుకోవాలని అనుకుంటున్నారట. 



క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

Apple : https://tinyurl.com/NIHWNapple.

మరింత సమాచారం తెలుసుకోండి: