ప్రపంచవ్యాప్తంగా చైనాపై భయంకరంగా వ్యతిరేకత పెరుగుతోంది. తమ దేశంలో జన్మించిన మహమ్మారి కరోనా వైరస్ ని తమకి అంటించి ఆ దేశం మాత్రం ఒకే ఒక నగరానికి పరిమితం చేసుకుందనే ఆగ్రహం దాదాపు అన్ని దేశాలలో కనిపిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు లక్షన్నర మంది చనిపోయారు. మరోవైపు 22 లక్షల మందికి ఈ వ్యాధి సోకింది. దీని వ్యాప్తిని చూస్తే త్వరలోనే అది 50 లక్షలకు చేరుకునే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇదిలా ఉంటే చైనా పై ఆగ్రహం ఉన్న పలు దేశాలు వాటిని ఉపసంహరించుకున్నాయి. ఇటీవల చైనా లో నెలకొల్పిన కార్ల ఫ్యాక్టరీ నీ మూసి వేస్తున్నట్లు ఫ్రాన్స్ దేశం కి చెందిన ప్రముఖ కంపెనీ ప్రకటించింది.

 

ఆ తర్వాత జపాన్ దేశం కూడా ఇదే బాటలో నడుస్తోంది. చైనాలో కంపెనీలో స్థాపించిన తమ దేశస్తులు స్వదేశానికి వచ్చి కంపెనీలు పెడితే వాళ్లకి 100 కి 100% పూర్తి ఖర్చు తామే భరిస్తామని జపాన్ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. అక్కడితో ఆగకుండా అనుకున్నదే తడవుగా దీనికోసం ఏకంగా 50 వేల కోట్ల రూపాయలను ప్యాకేజీ సైతం ప్రకటించింది. ఇప్పుడు ఇదే రూట్ లో తాజాగా దక్షిణ కొరియా చైనాలో తన దేశ పెట్టుబడిదారులకు బంపర్ ఆఫర్ ప్లస్ ప్యాకేజీ ప్రకటించింది. చైనాలో పెట్టుబడి పెట్టిన తన సంస్థలను పెట్టుబడిదారులను వెంటనే ఉపసంహరించుకోవాలని తమ దేశానికి విచ్చేయాలని కోరింది. అవసరాలతో పాటు భారీ ప్యాకేజీ కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నట్లు తెలిపింది.

 

ఈ సందర్భంగా చైనాలో ఉపసంహరించుకున్న తమ కంపెనీలకు మన భూభాగంలో లేకపోతే అయినా మినహా మీ ఇష్టం వచ్చిన దేశంలో పెట్టుబడుల పెట్టుకోవచ్చని చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా ఎక్కువగా పెట్టుబడిదారులకు భారత్ పేరు సూచించింది. ఈ దెబ్బతో చైనాకి సౌండ్ లేకుండా ఈ విధంగా ఇండియాకి సౌత్ కొరియా గుడ్ న్యూస్ చెప్పింది. రాబోయే రోజుల్లో కూడా అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచ దేశాలు మొత్తం ఏకమయి చైనాని ఒంటరి చేయటానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: