2009లో వైయస్సార్ మరణానంతరం ఏపీ రాజకీయాల్లో వైయస్ ఫ్యామిలీ చరిత్ర లేకుండా చేయాలని సోనియా గాంధీ, తెలంగాణ కాంగ్రెస్ నేతలు, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నో కుట్రలు చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ కుట్రల్లో భాగస్వామి అయ్యారు. 2012లో జరిగిన ఉపఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ వేరువేరుగా పోటీ చేసినా చాలా నియోజకవర్గాల్లో ఒక పార్టీ మరొక పార్టీకి మద్దతు ఇచ్చిందనేది బహిరంగ రహస్యం. 
 
కాంగ్రెస్, టీడీపీ కలిసి వైయస్ జగన్ ను, వైయస్ విజయమ్మను ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు. రాష్ట్రంలో వైసీపీ బలోపేతం కాకుండా ఎన్నో ప్రయత్నాలు చేశారు. చంద్రబాబు జగన్ పై, వైయస్ ఫ్యామిలీపై నిరాధార ఆరోపణలు చేసి ప్రజల్లో వైసీపీపై వ్యతిరేకత తీసుకురావడానికి ప్రయత్నించారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కూల్చే అవకాశం ఉన్నప్పటికీ చంద్రబాబు కిరణ్ సర్కార్ కు మద్దతు ఇస్తూ పరోక్షంగా వైసీపీపై కుట్రలకు తెరలేపారు. 
 
కాంగ్రెస్ పై అవిశ్వాసం పెట్టకుండా చంద్రబాబు మొదటి నుండి వైసీపీనే టార్గెట్ చేస్తూ వచ్చారు. జగన్, వైయస్ ఫ్యామిలీ లక్షల కోట్ల రూపాయల అవినీతి చేశారని చంద్రబాబు, ఆ పార్టీ నేతలు అసత్యాలను ప్రచారం చేశారు. 2012 ఉపఎన్నికల సమయంలో విజయమ్మ పార్టీని గెలిపించే బాధ్యతలను స్వీకరించారు. ఆ సమయంలో చంద్రబాబు కాంగ్రెస్ తో కలిసి వైసీపీ ఉప ఎన్నికల్లో గెలవకుండా కుట్ర చేశారు. 
 
కానీ ఎవరూ ఊహించని విధంగా 18 శాసనసభ స్థానాల్లో పోటీ చేసిన వైసీపీ 2012 ఉపఎన్నికల్లో 15 స్థానాల్లో ఘనవిజయం సాధించింది. 2014 ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ అదికారంలోకి వచ్చిన తరువాత కూడా ఇబ్బందులకు గురి చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ విజయమ్మ చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని ఆరోపణలు చేసినా ఆ ఆరోపణలపై స్పందిస్తూ రాష్ట్రంలో వైసీపీని అధికారంలోకి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: