ప్రస్తుతం ప్రపంచమంతటా బీభత్సం గా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ కి ఇప్పటివరకు సమర్థవంతమైన వ్యాక్సిన్ గానీ మందు గానీ కనిపెట్టలేదు. మన దేశంలో బాగా తయారయ్యే హైడ్రోక్సీక్లోరోక్విన్ మాత్రలు అమెరికా, ఫ్రాన్స్ లాంటి దేశాలలో సానుకూల ఫలితాలను చూపిస్తున్నాయి కానీ దాని వాడకం వలన భయంకరమైన దుష్ఫలితాలు వస్తాయని భారతీయ డాక్టర్లు చెబుతున్నారు. మలేరియా వ్యాధి మన దేశంలో ఎక్కువగా ఉండటం వలన యాంటీ మలేరియా మాత్రలైనా హైడ్రోక్సీక్లోరోక్విన్స్ లను ప్రముఖ వైద్య పరిశోధన కేంద్రాలు ఎక్కువగా తయారు చేశాయి. కానీ అమెరికా లాంటి చలి దేశాలలో మలేరియా వ్యాధిగ్రస్తులు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. అందుకే అక్కడ హైడ్రోక్సీక్లోరోక్విన్ కి అంతగా ప్రాముఖ్యత లేక... ఏ సంస్థ కూడా ఆ మాత్రలను తయారు చేయలేదు. ఫలితంగా ఆయా దేశాలు మన యాంటీ మలేరియా మందులు పంపిణీ చేయాలని కోరుతున్నాయి.


మన భారతీయులపై ఎలాగో ఆ మందులు సైడ్ ఎఫెక్ట్స్ చూపుతాయి కాబట్టి మోడీ ఆ మాత్రలను ఇతర దేశాలకు సరఫరా చేస్తున్నారు. కరోనా రక్కసిని అంతమొందించాలంటే ఏ మాత్రలు గానీ ఏ వ్యాక్సిన్ గానీ అవసరమే లేదని చెప్తున్నా మోడీ ఇంతకీ ఏమంటున్నారంటే... కరోనా బారిన పడి చికిత్స చేయించుకోవడం కంటే... ముందుగానే చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని కరోనా బారిన పడకపోవడమే తెలివైన పని అని అంటున్నారు. ఇటీవల తాను ఒక ప్రసంగంలో మాట్లాడుతూ... రోగ నిరోధక శక్తి ఎంత ఎక్కువగా ఉంటే... కరోనా వైరస్ సోకే అవకాశాలు అంత తక్కువగా ఉంటాయని తెలిపారు. రోగ నిరోధక శక్తి పెరగాలంటే... ప్రతిరోజు గోరువెచ్చటి నీటిని తాగాలని చెప్పారు. అలాగే ఆయుష్ మంత్రిత్వ శాఖ ఇచ్చిన మార్గదర్శకాలు ప్రతి ఒక్కరూ పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఆ మార్గదర్శకాలను ఒక్కసారి చూసుకుంటే...


1. ఆయుర్వేద ఆహార ముడి సరుకులైన పసుపు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి మనం రోజూ చేసుకునే వంటలు తప్పనిసరిగా ఉండాలి.


2. తులసి, దాల్చిన చెక్క, శొంఠి, మిరియాల మిశ్రమం తో తయారుచేసిన కాషాయం రోజులో ఒక్కసారైనా స్వీకరించాలి. ఈ మిశ్రమంలో అనేకమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అవి మనలోని రోగనిరోధక శక్తిని పెంచి ఎటువంటి వ్యాధి మన దరి చేరకుండా పోరాడతాయి.


3. పాలు, పసుపు కలిసిన మిశ్రమాన్ని ప్రతి రోజు తాగుతుంటే మనకి ఎటువంటి వ్యాధినైనా ఎదుర్కొనే శక్తి వద్దన్నా వస్తుంది.


4. నువ్వుల నూనెగాని కొబ్బరి నూనె చుక్కలు గాని మన ముక్కులో ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేసుకుంటే ఎటువంటి శ్వాసకోశ సంబంధిత వ్యాధులు రావు.


5. నువ్వుల నూనె, వంటల్లో వాడే కొబ్బరి నూనె రెండు కలిపి నోట్లో ఒక 15 నిమిషాలపాటు పుక్కిలించి ఆ తర్వాత మొత్తం మిశ్రమాన్ని ఉమ్మి వేయాలి. అనంతరం ఒక గ్లాసు వేడి నీటితో నోటిని శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజులో ఒకట్రెండు సార్లు చేయడం ద్వారా ఎటువంటి వ్యాధులు, వైరస్ లు మనకు సోకవు. 

మరింత సమాచారం తెలుసుకోండి: