ఎప్పుడు ఎలా పోతుందో తెలియని ప్రాణం కోసం మనుషులు బ్రతికినంత కాలం మనసులో కోపాలు, ద్వేషాలు, అసూయ పెంచుకుని జీవిస్తారు.. మనిషి ప్రాణం ఎక్కడ పోవాలని రాసి ఉందో అక్కడ ఆ జీవి తుదిశ్వాస విడవడం తధ్యం అని చాలా సందర్భాల్లో నిరూపించబడింది.. ఈ మధ్య వచ్చిన కరోనా వైరస్‌తో పేద, ధనిక అనే తేడా లేకుండా మరణిస్తున్న వారిని చూస్తే ఎన్నో జీవిత సత్యాలు బోధపడతాయి.. అందరు ఉన్నా.. ఆస్తులు ఉన్నా.. అనాధలా.. అయిన వారి చివరి చూపుకు కూడా నోచుకోకుండా దిక్కులేని మరణాన్ని పొందుతున్నారు.. అంత్యక్రియలకు కూడా దారిలేని పరిస్దితుల్లో మరణిస్తున్నారు.. మరికొందరి చావు చాలా దయనీయస్దితిలో జరుగుతుంది..

 

 

ఇకపోతే ఒక్కొక్కసారి పొట్టకూటికోసం వచ్చి ఊరుకాని ఊరులో ప్రమాదంలో చనిపోయిన వారి పరిస్దితి చూస్తే దారుణంగా ఉంటుంది.. అందులో తాము చేయని తప్పుకు.. మరొకరి నిర్లక్ష్యం వల్ల మరణిస్తే.. చనిపోయిన వారి కుటుంబ పరిస్దితి ఏంటి.. ఇలాంటి సంఘటనే  సిద్దిపేట జిల్లాలో జరిగింది.. ఒక డ్రైవర్ అజాగ్రత్త వల్ల వలస కూలీలు ఇద్దరు మరణించారు.. ఆ బోర్‌వెల్ లో పనిచేసే కొంతమంది యువకులు ఆ బోర్‌వెల్ వాహనం ఆగి ఉన్న సమయంలో దానికింద నిద్రిస్తుండగా.. వారిని గమనించకుండా ఆ డ్రైవర్‌ వాహనం తీశాడు. దీంతో బోర్‌వెల్ వాహనం దాని కింద పడుకున్న యువకుల పైనుంచి పోవడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు.

 

 

ఇక ఈ ప్రమాదం సిద్దిపేట జిల్లాలోని చేర్యాల మండలం నాగపురి శివారులోని దూదేకులపల్లి వద్ద ఈరోజు వేకువజామున చోటు చేసుకుంది. మృతి చెందిన వారిని ఛత్తీస్‌గఢ్‌ వాసులుగా గుర్తించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.. ఇక సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్దలికి చేరుకుని విచారణ చేపట్టారు.. అసలే లాక్‌డౌన్ సమయంలో పాపం ఇలా అనుకోకుండా మరణించిన వారి పరిస్దితి ఎంత ఘోరంగా మారుతుందో తలుచుకుంటేనే మనుసున్న ప్రతివారికి బాధ కలుగుతుంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: