లాక్‌డౌన్ కార‌ణంగా ఏపీలో  అత్య‌వ‌స‌రాలను తీర్చే ప‌రిశ్ర‌మ‌లు మిన‌హా మిగ‌తావ‌న్నీ మూత‌ప‌డ్డాయి. సుధీర్ఘ‌కాలంగా లాక్‌డౌన్ కొన‌సాగుతుండ‌టంతో రాష్ట్ర ప్ర‌భుత్వానికి ద‌మ్మిడీ ఆదాయం రాకుండాపోతోంది. లాక్‌డౌన్ వల్ల రాష్ట్రానికి ఆర్థికంగా నష్టం వస్తోందని ఏపీ ప్రభుత్వం మొదటి నుంచి చెబుతోంది. క‌రోనా విజృంభ‌న‌తో అటు కేంద్రం కూడా ఎలాంటి ఆదేశాలు ఇవ్వ‌లేని ప‌రిస్థితి. అయితే కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 20 నుంచి లాక్‌డౌన్‌పై కొన్ని ప‌రిశ్ర‌మ‌ల‌కు స‌డ‌లింపు ఇవ్వాలని నిర్ణ‌యించిన విష‌యం తెలిసిందే. దీంతో  ఏపీ ప్రభుత్వం కాస్త కుదుట‌ప‌డ‌నుంద‌నే చెప్పాలి. 

 

కేంద్రం ఆదేశానుసారంగా  కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. వాటి ప్రకారం... రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్ నుంచి మినహాయింపులు లభించనున్నాయి. ఏపీ ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన మార్గ‌ద‌ర్శ‌కాలు ఈ విధంగా ఉన్నాయి. అత్యవసర వస్తుత్పత్తి పరిశ్రమలకు పరిమిత మినహాయింపు లుంటాయి. అలాగే  ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ఉన్న పరిశ్రమలు న‌డిపించుకునేందుకు అవకాశం ఉంటుంది. ఆర్వో ప్లాంట్లు, ఆహారోత్పత్తి పరిశ్రమలు, మందుల తయారీ కంపెనీల నిర్వ‌హ‌ణ‌కు కూడా అనుమ‌తులివ్వ‌డం జ‌రిగింది.ఇక రైస్, పప్పు మిల్లులు, పిండిమరలు, డైరీ ఉత్పత్తుల పరిశ్రమలకు,  మాస్కులు, బాడీ సూట్ల తయారీ సంస్థలకు, సబ్బులు తయారీ కంపెనీలు, శీతల గిడ్డంగులు, ఆగ్రో పరిశ్రమలు, బేకరీ, చాక్లెట్ల తయారీ పరిశ్రమలకు, ఐస్ ప్లాంట్లు, సీడ్ ప్రాసెసింగ్ కంపెనీలకు లాక్‌డౌన్ నుంచి మిన‌హాయింపు ద‌క్క‌నుంది. 

 

అలాగే రాష్ట్రంలో ఈ-కామర్స్ సంస్థ‌లు సేవ‌లందించవ‌చ్చు. అమెజాన్, వాల్ మార్ట్, ఫ్లిప్ కార్ట్ కార్యకలాపాలకు ఆటంకం ఉండ‌బోదు. ప్రత్యేక ఆర్థిక మండళ్లు, ఎగుమతుల యూనిట్లకు ఆటంకం ఉండ‌బోదు. ఇదిలా ఉండ‌గా రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. ఇలాంటి స‌మ‌యంలో లాక్‌డౌన్ నుంచి స‌డ‌లింపు ఇవ్వ‌డం వ‌ల్ల ప్ర‌మాద‌మే అనేవారు ఉన్నారు.  కృష్ణా , కర్నూలు ,  నెల్లూరు,  ప్రకాశం జిల్లా,  తూర్పుగోదావరి జిల్లా , పశ్చిమగోదావరి జిల్లాలొ క‌రోనా కేసులు ఎక్కువ‌గా న‌మోద‌య్యాయి.  గుంటూరులో ఇప్ప‌టివ‌ర‌కు అత్య‌ధికంగా న‌మోదు కావ‌డం గ‌మ‌నార్హం.

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: