దేశంలో రోజు రోజుకీ పెరిగిపోతున్న కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ఎన్ని ప్రయత్నాలో చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  ప్రతి చోట కరోనా వ్యాప్తి జరగకుండా తగు చర్యలు తీసుకుంటున్నా ప్రభుత్వ అధికారులు.  అయితే కరోనా వైరస్ ప్రబల కుండా ఏపీ సీఎం ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేస్తూ పర్యవేక్షిస్తున్నారు.  అయితే కరోనా ఎక్కువగా గుంటూరు, కర్నూల్, కృష్ణలో ఎక్కువగా ప్రబలి పోతుందని అంటున్నారు.దానికి కారణం ఢిల్లీ ముజాహిద్దీన్ మర్కజ్ యాత్ర కు వెళ్లి వచ్చినప్పటి నుంచి కేసులు ఎక్కువగా ప్రబలి పోతున్నాయని అంటున్నారు.

 

 

మర్కజ్ కార్యక్రమంలో పాల్గొని వచ్చిన వారు ఇప్పటికీ కొంత మంది తప్పించుకు తిరుగుతున్నారని.. వారు ఇప్పటికైనా స్వచ్చందంగా లొంగిపోయి ట్రీట్ మెంట్ తీసుకోవాలని అంటున్నారు.  తాజాగా రెడ్‌జోన్ల పరిధిలోని ప్రజలు పూర్తిగా ఇళ్లకే పరిమితం కావాలని, పోలీసులు ఎంత కట్టడి చేస్తున్నా ఇది జరగడం లేదని, ఈ సమస్యే కేసుల సంఖ్య పెరగడానికి కారణమవుతోందని విజయవాడ సీపీ ద్వారకాతిరుమలరావు అన్నారు.  ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నా కొంత మంది నిర్లక్ష్యం వల్ల ఇలాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయని అంటున్నారు 

 

 

 ‘రెడ్‌జోన్లలో నివసిస్తున్న వారు 'ఇక్కడిక్కడే కదా' అన్న ఉద్దేశంతో నివాసాల సమీపంలో ఫ్రీగా తిరిగేస్తున్నారు. చుట్టుపక్కల పోలీసులు ఎంత గట్టినిఘా పెట్టినా ఇంటర్నల్‌గా ప్రజలు కట్టడి పాటించడం లేదు. వీధుల్లో సంచారంతో వైరస్‌ వేగంగా విస్తరించి కేసులు పెరుగుతున్నాయి’ అని తెలిపారు.   చుట్టుపక్కల పోలీసులు ఎంత గట్టినిఘా పెట్టినా ఇంటర్నల్‌గా ప్రజలు కట్టడి పాటించడం లేదు. రెడ్ జోన్లలో విధులు నిర్వహించే పోలీసుల వ్యక్తిగత భద్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని, వారికి రక్షణ పరికరాలు అందజేస్తున్నామని తెలిపారు. వీధుల్లో విచ్చలవిడిగా తిరుగుతున్నారు.  కరోనా వ్యాప్తి ప్రబలి పోతుందని హెచ్చరించినా లెక్కచేయడం లేదని అన్నారు. ఇక నుంచి లాక్ డౌన్ పై సీరియస్ గా ఉంటామన్నారు. 

  

మరింత సమాచారం తెలుసుకోండి: