ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి తల్లి గారైన విజయమ్మ తన 64 వ పుట్టిన రోజును ఈ రోజు ఏప్రిల్ 19న జరుపుకుంటున్నారు. ఈరోజు ఉదయం నుండే తెలుగు రాష్ట్రాల లోని లక్షల మంది ప్రజలు ఆమెకు సామాజిక మాధ్యమాల ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా ఆమెపై గతంలో జరిగిన విమర్శల గురించి ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.


గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ లభించక పోవడంతో... వైయస్ విజయమ్మ తన కుమార్తె షర్మిలతో కలిసి పాదయాత్ర కార్యక్రమంలో పాల్గొనేవారు. అయితే ఆ పాదయాత్రలో పాల్గొన్న ఆమె తన వెంట బైబిల్ తెచ్చుకునేవారు. దీన్ని ఉద్దేశిస్తూ టిడిపి పార్టీ నేతలు విజయమ్మ మత ప్రచారానికి పాల్పడుతున్నారని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అప్పట్లో టిడిపి ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ప్రజా పాదయాత్రలో మీరు ఎందుకు బైబిల్ లాంటి మతపరమైన గ్రంధాలను తీసుకొస్తున్నారని మీడియా సమావేశంలో ప్రశ్నించారు. అత్యంత పవిత్రమైన బైబిల్ గ్రంధాన్ని రాజకీయాల కోసం వాడుకోవడం ఎంతవరకు సమంజసమని ఆయన అన్నారు. కొండా సురేఖ లాంటి వాళ్లు కూడా విజయమ్మ బైబిల్ ని పాదయాత్రలో పట్టుకోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.


అయితే ఈ విమర్శలన్నిటి పై పెదవి విప్పిన విజయమ్మ... నేను బైబిల్ పట్టుకోవడం అనేది, దేవుణ్ణి నమ్మడం అనేది నా వ్యక్తిగతం. అది నాకు రాజ్యాంగం కల్పించిన హక్కు. నేను ఎక్కడా కూడా నా మతం గురించి ఏ సందర్భంలో ప్రచారం చేయలేదు. రాజకీయంలో నేను ఎప్పుడూ మత ప్రచారం చేయలేదు. నా మతం వేరు, నా రాజకీయం వేరు. బ్రదర్ అనిల్ కుమార్ కూడా ఎవరినీ క్రైస్తవ మతంలోకి చేరమని ఎన్నడూ అడగలేదు' అని ఆమె స్పష్టం చేశారు. ఏది ఏమైనా ప్రజలందరికీ ప్రీతిపాత్రులైన విజయమ్మ మనస్తత్వం బంగారం అని అందరికీ తెలుసు. అటువంటి ఆమె పై నిరాధార విమర్శలు చేసి పాపం మూట కట్టుకుంటున్నారు కొందరు నీచ రాజకీయ నేతలు. 

మరింత సమాచారం తెలుసుకోండి: