వైఎస్ విజయమ్మ పరిచయం అవసరంలేని పేరు. ఒక్క మాటలో చెప్పాలంటే  భర్త  వైఎస్ రాజశేఖర్ రెడ్డి , తనయుడు వైఎస్ జగన్ ల విజయం వెనుకాల  దాగి ఉన్న ఏకైక వ్యక్తి, స్త్రీ శక్తి. భార్యగా, తల్లిగా అనుక్షణం తన కుటుంభాన్ని కాపాడుకుంటూ, ఎన్నో సవాళ్ళని ఎదుర్కుంటూ, పంటికింద బాధలని తొక్కిపెడుతూ అవమానాల దారులను దాటుకుంటూ ,ఇప్పుడు ఎంతో మందికి స్పూర్తిగా నిలిచారు ఆదర్శం అయ్యారు. కష్టాలు వచ్చినపుడు గుండె నిబ్బరంగా ఎలా ఉండాలనేది విజయమ్మ జీవితాన్ని ఒక్క సారి పరికించి చూస్తే అర్థమవుతుంది.

IHG

వైఎస్ మరణం తరువాత నా వాళ్ళు అనుకున్న వాళ్ళే జగన్ ని ఇబ్బందులకి గురిచేస్తుంటే. అండగా ఉంటుందని అంటుకున్న పార్టీనే నిందలు వేస్తుంటే..కళ్ళలో పెట్టుకుని పెంచుకున్న కొడుకుని భర్త చనిపోయిన  తరువాత జైలుకి పంపితే ఆ తల్లి హృదయం  ఎంత తల్లడిల్లి ఉంటుంది. అయినా ఆమె నమ్మకం ఒక్కటే వైఎస్ ని ప్రేమించి అభిమానించే ప్రతీ గుండె తన బిడ్డ జగన్ కి అండగా ఉంటారు.తమ కుటుంభానికి తోడుగా ఉంటారని. ఆ నమ్మకమే వైఎస్ జగన్ ని గెలిపించింది..వైఎస్ విజయమ్మ ప్రేమే జగన్ ని ఈ రాజకీయ చదరంగంలో తిరుగులేని వ్యక్తిగా నిలబెట్టింది..

IHG

కడప జిల్లా బలపనూరు లో జన్మించిన విజయమ్మ పులివెందులలో ఇంటర్ చదవుతున్న సమయంలోనే  వైఎస్ రాజశేఖర్ రెడ్డి తో వివాహం జరిగింది. వైఎస్ రాజకీయాలలో ఎంతో బిజీగా ఉంటున్న సమయంలో విజయమ్మే కుటుంబాని చక్కదిద్దుకునే వారు. ఇంటికి వచ్చిన అతిదులని, కార్యకర్తలు ఇలా ప్రతీ ఒక్కరికి ఎలాంటి లోటు రాకుండా చూసుకునే వారు. వైఎస్ కి విజయమ్మ అంటే ఎంతో సెంటిమెంట్ వైఎస్ బయటకి వెళ్ళాలంటే తప్పకుండా విజయమ్మ ఎదురు రావాల్సిందే..ఆమె ఎదురొస్తే విజయం ఖాయమని వైఎస్ అనేవారట. వైఎస్ మరణం అనంతరం..

IHG

తమ కుటుంభం చుట్టూ జరుగుతున్న రాజకీయ పరిమాణాలని చూసి  విజయమ్మ భయపడలేదు..భర్తకి ప్రతీ విషయంలో ఎలా తోడుగా ఉన్నారో...తనయుడు జగన్ కి అండగా  ఉంటూ ఎంతో ధైర్యం చెప్పారు. తనయుడి కోసం, వైఎస్ ని ప్రేమించే ప్రజలకోసం రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రావడం కోసం నిర్విరామంగా ప్రచారాలు చేపట్టారు. తనయుడిని పై హత్య ప్రయత్నం జరిగిన సమయంలో ఆమె మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడిన మాటలు అందరిని కదిలించాయి. 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించిన తరువాత ప్రమాణ స్వీకార వేదికపై తనయుడిని హత్తుకుని ఆమె రాల్చిన ఆనంద బాష్పాలు కటిన పాశాణాన్ని అయినా కదిలిస్తాయి. ఎన్నో సవాళ్లు ఎదుర్కున్న విజయలక్షి రెడ్డి...ప్రస్తుతం ఎంతో మంది తెలుగు ప్రజల గుండెల్లో  అమ్మగా..విజయమ్మగా నిలిచిపోయారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: