చాలామంది గ్రాట్యుటీ అంటే పిఎఫ్ గురించి అని అనుకుంటూ ఉంటారు కానీ.. పిఎఫ్, గ్రాట్యూటీ ఎటువంటి సంబంధం లేదు. సాధారణంగా గ్రాట్యుటీ అంటే మీరు పనిచేసే కంపెనీలో సేవలకు అనుగుణంగా కంపెనీ నుంచి చెల్లించే డబ్బులు అని గ్రాట్యుటీ అంటారు. ఇక ఈ గ్రాట్యూటీ  డబ్బులు ఎవరికీ చెల్లిస్తారు అన్న విషయానికి వస్తే ఉద్యోగులు రిటైరయ్యాక, మధ్యలోనే కంపెనీలు కంపెనీ ఉద్యోగం నుంచి తొలగించిన, సదరు వ్యక్తి మధ్యలో ఉద్యోగం వదిలేసిన.. వారందరికీ చెల్లిస్తారు. దీని కోసం కొన్ని కండిషన్ లు ఉంటాయి. 

 


ఈ గ్రాట్యూటీ 1972లో కేంద్ర ప్రభుత్వం పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ ప్రవేశపెట్టింది. దీనికి అనుగుణంగా ప్రతి కంపెనీ సదరు ఉద్యోగులకు గ్రాట్యుటీ డబ్బులు కచ్చితంగా చెల్లించాల్సిందే. యాక్ట్ లో తెలుపబడిన నిబంధనలు సంస్థల ఉద్యోగులకు అన్నిటికీ కూడా వర్తిస్తాయి. కానీ గ్రాట్యూటీ అర్హత పొందాలి అంటే కచ్చితంగా ఆ కంపెనీలో కనీసం ఐదు సంవత్సరాలు ఉద్యోగుల సర్వీస్ చేయాలి. అప్పుడు మాత్రమే గ్రాట్యుటీ అర్హత పొందగలరు. ఇక గ్రాట్యుటీ ఎలా లెక్కిస్తారు అన్న విషయానికి వస్తే... పదిహేను రోజుల బేసిక్ సాలరీ  సర్వీస్ పీరియడ్ కలిపి లెక్క చేయడం జరుగుతుంది. అంతే కాకుండా ఆరు నెలల కంటే ఎక్కువగా చేసినా దాన్ని కూడా సంవత్సరంలోకే లెక్కిస్తారు అన్నమాట. 

 

 

ఇక గ్రాట్యూటీ అమౌంట్ మినిమం పరిమితి లేదు కానీ గరిష్ట పరిమితి మాత్రం ఉంది అనే చెప్పాలి. ఆ పరిమితి ఇప్పటివరకు 10 లక్షలు ఉండేది.. కానీ తాజాగా ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో 20 లక్షల వరకు పెంచడం జరిగింది. అది కూడా పన్ను మినహాయింపు కిందికి వస్తుంది అని కేంద్ర బడ్జెట్లో తెలియజేయడం జరిగింది. ఈ గ్రాట్యూటీ అమౌంట్ పొందడానికి ఎప్పుడు అప్లై చేయాలి అన్న విషయానికి వస్తే... ఉద్యోగం మానేసి నా రిటైర్డ్ అయిన .. ఒక్క నెలలోపే గ్రాట్యుటీ డబ్బుల కోసం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.  ఒకవేళ ఏదైనా కంపెనీ గ్రాట్యుటీ అమౌంట్ పే చేయకపోతే ఆ కంపెనీ పై అసిస్టెంట్ లేబర్ కమిషనర్ కు ఫిర్యాదు కూడా చేసుకునే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: