కరోనా వైరస్ దెబ్బకి అన్ని వర్గాలకు సంబంధించిన ఇండస్ట్రీలో చాలావరకు మూతపడ్డాయని చెప్పవచ్చు. దీని కారణంగా న్యూస్ పేపర్ల సర్క్యులేషన్ కూడా పడిపోగా, అలాగే సీరియల్ షూటింగ్ ఆగిపోయింది. ఎంటర్టైన్మెంట్ చానల్స్ రేటింగ్స్ కూడా దారుణంగా పడిపోయాయి. ఇక థియేటర్ల విషయానికి వస్తే... అవి పూర్తిగా మూతపడ్డాయని చెప్పవచ్చు. మీరు ఈ విధంగా ఇబ్బంది పడుతుంటే కొందరికి మాత్రం ఈ కరోనా మేలు చేస్తుందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండడంతో డిజిటల్ స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫార్మ్స్ కి ఒక్కసారిగా డిమాండ్ భారీగా పెరిగింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, ఆహా ... ఇలా వివిధ ఆన్లైన్ ఫ్లాట్ ఫార్మ్స్ కి భారీగా రెవెన్యూ వస్తుంది.

 


అలాగే ఇక ప్రస్తుతం ట్రెండీగా ఉన్న యూట్యూబ్ ఛానల్, వెబ్సైట్ వార్తలకు బాగా డిమాండ్ పెరిగిపోయింది. అలాగే యూట్యూబ్ లో ప్రత్యేకంగా ఉండే వంట ఛానళ్లను పెట్టి రకరకాల వంటకాలను పోస్ట్ చేస్తున్నారు. నిజానికి ఇప్పుడు వీటికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం ఈ సమయంలో ఇంట్లో ఖాళీగా కూర్చుని చాలా మంది యూట్యూబ్ లో వచ్చే వంటకాలు పాటలు నేర్చుకుంటున్నారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ముఖ్యంగా భార్యాభర్తలు పిల్లలు అందరూ ఇంట్లో ఉండగా కొత్త వెరైటీ వంటకాలు చేసుకోవాలన్న ఆత్రంతో యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి అందరూ ఏకలవ్య శిష్యులుగా మారిపోతున్నారు.

 


ఇందులో కూడా ఇంగ్లీష్, తెలుగు, హిందీ ఇలా వారి వారి  మాతృభాషలో ఛానళ్లను ఏర్పాటుచేసి ప్రజల హృదయాలను ఆకట్టుకుంటున్నారు. అయితే ప్రస్తుతం తెలుగులో కుకింగ్ ఛానల్ నడుపుతున్న వారంతా ఒక్కసారిగా ఇలా ఫేమస్ అయిపోయారు. ఇది సబ్ స్క్రైబర్స్ సంఖ్య కూడా భారీగా పెరిగిందని చెప్పవచ్చు. అలాగే వాటికి చూసే మనుషులు ఎక్కువ కావడంతో లైకులు, డౌన్లోడ్లు ఎక్కువ కావడంతో వారికి వచ్చే ఇన్కమ్ చాలా పెరిగింది. ఇది ఇలా ఉంటే ఇది వరకే చేసిన వంటకాలకి లైకులు పెరగడంతో వారి పంట పండుతోంది. నిజానికి లాక్ డౌన్ సమయానికి ముందు మొబైల్ ఫోన్స్, ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఛానెల్ కు ఎక్కువ డిమాండ్ ఉండేది కానీ ఇప్పుడు పరిస్థితి చాలా ఘోరంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: