తెలంగాణ ముఖ్యమంత్రి మ‌రికొద్ది గంట‌ల్లో కీల‌క నిర్ణ‌యం తీసుకోబోతున్నారు. కేంద్ర ప్ర‌భుత్వం ఆదేశాల‌ను అనుస‌రించి లాక్‌డౌన్‌పై కొన్ని ప‌రిశ్ర‌మ‌ల‌కు స‌డ‌లింపు ఇచ్చేందుకు సిద్ధ‌మ‌వుతోంది. అయితే రాష్ట్రంలో క‌రోనా ఉధృతి ఎక్కువ‌గా ఉంద‌ని భావిస్తున్న ముఖ్య‌మంత్రి కేసీఆర్ కేంద్ర‌ప్ర‌భుత్వం ఇచ్చిన ఆదేశాలపై రాష్ట్ర ఉన్న‌తాధికారులు స‌మ‌ర్పించే నివేదిక‌ల‌పై కూడా మార్పులు చేర్పులు చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా వైర‌స్ వ్యాప్తి 98శాతం పట్ట‌ణాల్లోనే ఉంద‌నే అభిప్రాయంతో ప్ర‌భుత్వం ఉంది. ఈనేప‌థ్యంలోనే లాక్‌డౌన్‌ను ప‌ల్లెల్లో పూర్తిగా ఎత్తివేసి ప‌ట్ట‌ణాల్లో మాత్రం ఆంక్ష‌లు కొన‌సాగించాల‌నే ఉద్దేశంతో ఉన్న‌ట్లు తెలుస్తోంది.

 

ఇక తెలంగాణ‌లో మూడు నాలుగు జిల్లా కేంద్రాలు మిన‌హా ఎక్కుగా స‌బ్ అర్బ‌న్‌, టౌన్లు, మండ‌ల కేంద్రాల్లో వ్యాప్తి కూడా చాలా వ‌ర‌కు లేదు. ఉన్నా ఇప్ప‌టికే బ‌య‌ట‌ప‌డాల్సి ఉంది. మ‌ర్క‌జ్ లింకులు కూడా లేవ‌నే నిర్ధార‌ణ‌కు అధికారులు వ‌చ్చారు. ప్రాబ్ల‌ముంతా కూడా హైదరాబాద్‌లోనే ఉంద‌ని, వ‌రంగ‌ల్‌, క‌రీంన‌గ‌ర్‌, సూర్య‌పేట‌, ఖ‌మ్మం, ఆదిలాబాద్‌, నిజామాబాద్ జిల్లా కేంద్రాల్లో క‌రోనా అల‌జ‌డి ఎక్కువ‌గా ఉన్న‌ట్లుగా అధికారులు నివేదిక స‌మ‌ర్పిస్తున్న‌ట్లు తెలుస్తోంది.  అందుకే గ్రేట‌ర్ ప‌ర‌ధిలో కఠిన ఆంక్షలు కొన‌సాగించి..ప‌ల్లెలకు స‌డ‌లింపు ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం యోచిస్తున్న‌ట్లు స‌మాచారం. 

 

ఆదివారం మధ్యాహ్నం 2.30కి తెలంగాణ ప్రభుత్వ కేబినెట్ సమావేశం జరగబోతోంది. ఈ స‌మావేశంలో లాక్‌డౌన్‌పై విస్తృత చ‌ర్చ జ‌ర‌గ‌బోతోంది. ఈ స‌మావేశం అనంత‌రం ముఖ్య‌మంత్రి కేసీఆర్ మీడియాతో మాట్లాడ‌నున్నారు. కేంద్ర ప్రభుత్వం రేపటి నుంచి లాక్‌డౌన్ నిబంధనల్ని సడలించడంతో... తెలంగాణలో ఎలా ముందుకెళ్లాలనే అంశంపై ఈ భేటీలో ప్రభుత్వం చర్చించబోతోంది. తెలంగాణలో ప్రస్తుతం పాజిటివ్ కేసుల సంఖ్య 809కి చేరింది. ఇప్పటి వరకు 18 మంది కరోనా బారిన పడి చనిపోయారు. ప్రస్తుతం తెలంగాణలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 605గా ఉండ‌టం గ‌మ‌నార్హం. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన కేసుల్లో స‌గం వ‌ర‌కు కూడా గ్రేట‌ర్ ప‌రిధిలోనే ఉండ‌టం భ‌యాందోళ‌న క‌లిగించే అంశం.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: