దేశంలో ఓ వైపు బీభత్సంగా కరోనా మహమ్మారి ప్రబలి పోతుంది.  దాంతో ఎవరూ ఇంటి నుంచి బయటకు రావొద్దని.. లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే.  ఎక్కడి వ్యవస్థలు అక్కడే స్థంబించి పోయాయి.  దాంతో ఓ వైపు ఆర్థిక వ్యవస్థ ఇబ్బంది అవుతుంది.  మరోవైపు సగటు మనవాళి నరకం అనుభవిస్తున్నారు.  బ్యాంకుల్లో తీసుకున్న లోన్లు, ఈఎం ఐ లు కట్ అవుతున్నాయి.. మరోవైపు ఇంటి అద్దెలు కట్టే పరిస్థితి లేదు. 

 

రోజు వారి కూలీలు, చిరు వ్యాపారుల, చిరు ఉద్యోగులు ఇంటి అద్దె చెల్లించే పరిస్థితి లేక ఇబ్బందులు పడుతున్నారు.  తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కర్నూలు, గుంటూరు జిల్లాల్లో అయితే కరోనా కేసులు ఎక్కువ అవుతూనే ఉన్నాయి.  అయితే ఇప్పుడు రెడ్ జోన్లో ఉన్న వారి ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. 

 

ఈ క్రమంలో గుంటూరు జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదై ఏవైతే రెడ్‌జోన్‌లుగా ప్రకటించామో అక్కడ ఏ ఒక్క ఇంటి యజమాని మూడు నెలలపాటు అద్దె వసూలు చేయరాదంటూ కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ ఆదేశాలు జారీచేశారు.  రెడ్‌జోన్లలో నివాసం ఉంటున్న వారిని ఆదుకొనేందుకు జిల్లాలోని స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని కోరారు.

 


కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: