దేశంలో కరోనా వ్యాప్తి చెందుతుందని గత నెల 24 నుంచి లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే.  అప్పటి నుంచి థియేటర్లు, మాల్స్, బార్, రెస్టారెంట్స్, మద్యం షాపులు అన్నీ మూసివేశారు.  అప్పటి నుంచి మద్యం ప్రియుల కష్టాలు మొదలయ్యాయి.  కొంత మంది మద్యం ఎలా తయారు చేసుకోవాలో సోషల్ మీడియాలో వెతుకుతున్నారని ఇటీవల వార్తలు వచ్చాయి.  మరికొంత మంది మద్యం తయారు చేయాలని పిచ్చి పనులు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. 

 

మరికొంత మంది పిచ్చిపట్టిన వాళ్లలా మారిపోతున్నారు.. ఎర్రగడ్డ ఆసుపత్రిలో ఎన్నో కేసులు వస్తున్నాయి.   కాగా తాజాగా ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామంతపూర్ చర్చికాలనీలో నివాసముంటున్న పొలిశెట్టి సుధాకర్‌ అనే వ్యక్తి తన తల్లి తెరిహమ్మతో కలిసి ఇంట్లోనే మద్యం తయారీని ప్రారంభించాడు. అయితే ఈ విషయం కాస్త అక్కడా ఇక్కడా తెలియడంతో సమాచారం పోలీసుల వద్దకు చేరుకుంది. 

 

వెంటనే వచ్చి నిందితుల వద్ద నుండి 25లీటర్ల మద్యం తయారీకి కావలసిన ముడి సరుకును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.  లాక్ డౌన్ ముగిసే వరకు ఇలాంటి అక్రమాలకు పాల్పడవొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.  

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: