కరోనా కాదు కానీ రాజకీయాలు వీర లెవెల్లో సాగుతున్నాయి. దానికి అచ్చమైన ఉదాహరణ ఏపీ పాలిటిక్సే. ఇక్కడ చంద్రబాబు అండ్ కో ఒక్క రోజు కూడా మౌనంగా ఉండలేకపోతున్నారు. కరోనా గురించే మాట్లాడుతూ  జగన్  ప్రభుత్వాన్ని  ఒక లెక్కన దుమ్మెత్తి పోస్తున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే అంతర్జాతీయంగానూ కరోనా చిచ్చు రాజేస్తోంది.

 

అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ చైనా మీద పగపట్టారు. ఆయన మాటలు తూటాల్లా మారి చైనాను తాకుతున్నాయి. అమెరికాలో కరోనా వీర విహారం చేస్తోంది. దీని వెనక చైనా  ఉందని ట్రంప్ అంటున్నారు. కరోనా వైరస్ ఇంత దారుణంగా ప్రబలిపోయినా కూడా బయటకు చెప్పకుండా చైనా సీక్రెట్ గా ఉంచిందని దాని వల్లనే ప్రపంచం ఇలా అతలాకుతలం అయిందని ట్రంప్ వాయించేస్తున్నారు.

 

అంతే కాదు చైనా చేస్తున్న ప్రతీ దానికీ ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా మద్దతుగా నిలిచిందని, కరోనా వైరస్ మీద అప్రమత్తం చేయకుండా అలసత్వం వహించిందని ట్రంప్ అంటున్నారు.  ఇక చైనా అమెరికా రాజకీయాల్లో జోక్యం చేసుకుంటోందని కూడా ట్రంప్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు.

 

ప్రెసిడెంట్ ఎన్నికల్లో అమెరికాలో చైనా మద్దతు ఉన్న అభ్యర్ధిగా   డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్ ఉన్నారంటూ ఆయనపైన  తీవ్ర విమర్శలు చేశారు. బిడెన్ అభ్యర్థిత్వానికి చైనా మద్దతుగా నిలుస్తోందని ఆరోపించారు. ఒకవేళ ఆయన గెలిస్తే అమెరికాను చైనా దేశం స్వాధీనం చేసుకుంటుందని ఆయన హెచ్చరించారు. నిజంగా ఇది ఘాటు ఆరోపణమే. ఏ అమెరికా ప్రెసిండెంట్ అయినా కూడా చైనాతో జాగ్రత్తగానే ఉంటాడు.

 

మరి ట్రంప్ తాను రెండవసారి కూడా గెలవాలనుకుంటున్నాడో ఏమో కానీ ఇపుడు కరోనా ముప్పు వల్ల అమెరికాలో మరణాలు వేలల్లో ఉన్నాయి. దాంతో తనకు జనాల్లో ఓటు పడదని భావించి చైనా మీద ఇలా అక్కసుతో విమర్శలు చేస్తున్నారని ప్రత్యర్ధి పార్టీలు అంటున్నాయి. మొత్తానికి కరోనా రాజకీయంతో అమెరికా చైనాల మధ్య కొత్త అగాధం ఏర్పడినట్లుగా ఉందనుకోవాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: