ప్రపంచమంతా కరోనా వైరస్ తో అల్లాడుతోంది. అయినా రాజకీయాలు మాత్రం ఎక్కడా ఆగడంలేదు. ఇక ఏపీలో చూసుకుంటే వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్లుగా పక్కా పాలిటిక్స్ సాగిపోతోంది. చంద్రబాబుకు తెల్లారి లేచి జగన్ని పట్టుకుని తిట్టకపోతే నిద్ర పట్టదు.

 

ఇక జగన్ తరఫున విజయసాయిరెడ్డి చంద్రబాబుని ప్రతీ రోజూ ట్విట్టర్ వేదికగా బాగా వేసుకుంటారన్నది తెలిసిందే. కరోనా వైరస్ వల్ల లాక్ డౌన్ పెడితే చినబాబు మాత్రం వీధుల్లోకి వచ్చి సైకిల్ తొక్కుతున్నాడని ఇక ఆయనకు అదే మిగిలిందని విజయసాయిరెడ్డి సెటైర్లు వేస్తున్నారు.

 

అంతే కాదు, తొందరలోనే శాసనమండలి రద్దు అవుతుందని, అపుడు చినబాబు ఇంట్లోనే హ్యాపీగా కూర్చోవచ్చునని విజయసాయిరెడ్డి సలహా ఇస్తున్నారు. ఈ మధ్యకాలమంతా శాసనమండలి రద్దు  ఊసే లేదు, అసలు పార్లమెంట్ ఎపుడు జరుగుతుంది అన్నది కూడా ఎవరికీ తెలియదు.

 

ఎందుకంటే దేశం మొత్తం ఆగిపోయింది కాబట్టి. కానీ విజయసాయిరెడ్డి మాత్రం అంతా మరచిపోయినా శాసన‌మండలి వూసు తెర మీదకు తెస్తున్నారు. మండలి కధ ముగిసినట్లేనని తొందరలోనే తలుపులు మూత పడడం ఖాయమని నిబ్బరంగా చెబుతున్నారు.

 

నిజానికి పార్లమెంట్ తిరిగి సమావేశమైనా  ఎన్నో ప్రధాన సమస్యలు దేశం ముందుకు వస్తాయి. వాటి ప్రాధాన్యతలతో పోలిస్తే మండలి రద్దు అన్నది పెద్ద విషయం కాదు. కానీ ఏపీలో రాజకీయాల ద్రుష్ట్యా జగన్ సర్కార్ కి ఇది అవసరం. 

 

మరి కావాలని అన్నారో, పట్టుదలగా తాము  పార్లమెంట్ లో మండలి రద్దు చేయించగలమని చెప్పుకున్నారో తెలియదు కానీ మండలి రద్దు అంటూ బాంబు మళ్ళీ పేల్చారు విజయసాయిరెడ్డి.

 

మరి మండలి రద్దు అయితే తమ్ముళ్ళు ముప్పయి మంది వరకూ ఇంటికెళ్ళిపోతారు. మొత్తానికి కరోనా ఉన్నా కూడా కలవ్రం పెంచే రాజకీయం మాత్రం ఎక్కడా ఎవరూ ఆపడంలేదుగా. వైసీపీ టీడీపీ మరి సమరమేగా. ఎపుడైనా.. ఎక్కడైనా.

 

మరింత సమాచారం తెలుసుకోండి: