కరోనా కారణంగా ప్రపంచ దేశాలు గడగడలాడుతున్నాయి. అయన ఓ ఐదడుగుల బులెట్..నేటి తరం హిట్లగా పిలువబడే కిమ్ పేరు చెబితేనే ప్రపంచ దేశాలకు వెన్నులో వణకుపుడుతుంది. ఈయన పేరుచెబితే ప్రపంచ అగ్రరాజ్యం అయిన అమెరికాకు సైతం నిద్ర పట్టదు. అంతటి ధైర్యశాలిగా పేరుగడించిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ ఆరోగ్య పరిస్థితి గురించి కథలు కథలుగా వినిపిస్తున్నాయి.ప్రపంచ దేశాలను కరోనా గడగడలాడిస్తుంటే కిమ్ మటుకు అడ్రస్ లేకుండా పోయాడు.

 

ప్రతి సంవత్సరం ఆయన తాతగారు అయినటువంటి కిమ్ ఇల్ సుంగ్ జయంతి ఉత్సవాలను కిమ్ దగ్గరుండి ఘనంగా జరిపిస్తారు. కానీ ఈ సంవత్సరం మటుకు కిమ్ ఈ ఉత్సవాలను జరిపించటానికి హాజరు కాలేదు. ప్రతి సంవత్సరం ఈ రోజున కిమ్ ఇల్ సుంగ్ జయంతి ఉత్సవాలను ఘనంగా చేస్తారు కానీ ఈ ఉత్సవాలు జరగక పోవడం ప్రప్రధమం. ఇలా జరగడాన్ని ఆదేశ పౌరులు అనుమానిస్తున్నారు. ఎందుకంటె కిమ్ ఒక చైన్ స్మోకర్ అందువలననే అయన ఆరోగ్యం క్షిణించి ఉంటుందని చెబుతున్నారు. అయితే కిమ్ తాత ముత్తాతలు కూడా చైన్ స్మోకింగ్ కారణంగానే చనిపోయారు ...ఈ కరంగా కిమ్ కి ఏదేని ప్రమాదం జరిగి ఉంటుందని అంతా అనుకుంటున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: