దేశంలో కరోనా వ్యాపిస్తున్న సమయంలో లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే.  అయితే  లాక్ డౌన్ సందర్భంగా అందరూ ఇంటిపట్టునే ఉంటున్నారు. కాకపోతే కొన్ని చోట్లు మాత్రం లాక్ డౌన్ ఉల్లంఘిస్తున్న విషయం తెలిసిందే.  ఇప్పటికే దేశంలో పదిహేను వేలకు చేరిన విషయం తెలిసిందే.  కోవిద్-19 విజృంభణ.. లాక్ డౌన్ పొడిగింపు.. సామాజిక దూరం.. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఓ శుభవార్త  తెలిపారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్.   అదేంటంటే.. భారత్‌లో కరోనా కేసులు రెట్టింపయ్యేందుకు పడుతోన్న సమయం పెరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ చెప్పారు.

 

గడచిన మూడు రోజుల్లో కరోనా కేసులు రెట్టింపయ్యేందుకు 9.7 రోజులు పడుతోందని చెప్పారు. 14 రోజుల్లో కరోనా కేసులు రెట్టింపయ్యేందుకు 6.2 రోజులు పట్టేదని, గడచిన వారంలో దీనికి 7.2 రోజుల సమయం పట్టిందన్నారు. ఢిల్లీలోని రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను సందర్శించిన హర్షవర్ధన్ కరోనా రోగుల ఆరోగ్య పరిస్థితిని గమనించారు. అడ్మిట్ అయిన 177లో 95 మంది రోగులు నేడు డిశ్చార్జ్ అవుతున్నారని తెలిపారు. రోజురోజుకీ పరిస్థితి మెరుగుపడుతోందని వివరించారు. 

 

కాగా, 24 గంటల్లో భారత్‌లో కొత్తగా నమోదైన కేసులతో కలిపి దేశంలో కరోనా కేసుల సంఖ్య మొత్తం 15,712కు చేరగా, ఇప్పటివరకు మొత్తం 507 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది.దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. భారత్‌లో కరోనా కేసుల సంఖ్య మొత్తం 15 వేలు దాటింది. 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: