కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పటికే కేసులు ఎక్కువగా పెరుగుతున్న చోట్ల కంటైన్మెంట్ క్లస్టర్లు ఏర్పాటు చేసి, లాక్ డౌన్ కంటిన్యూ చేస్తుంది.. మరోవైపు దగ్గ, గొంతు నొప్పి, జ్వరం ఉన్న వాళ్ళు మెడికల్ షాపులకు మందుల కోసం వచ్చిన వాళ్ళ వివరాలు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

 

తెలంగాణాలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే విదేశాల నుంచి వచ్చిన వాళ్ళతో పాటూ ప్రార్ధనలకు వెళ్ళి వచ్చిన వాళ్ళను వాళ్ళ కాంటాక్ట్స్ ను సర్వేలెన్స్ చేశారు. అయితే ఇకపై జ్వరం, దగ్గు, గొంతు నొప్పి ఉన్న వాళ్ళను సైతం కరోనా అనుమానితులుగా చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.. ఫీవర్ సర్వే లెన్స్ లో మెడికల్ షాపులను భాగస్వామ్యం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. ఇకపై మెడికల్ షాపులకు జ్వరం , గొంతు నొప్పి, దగ్గు మందుల కోసం వచ్చే వివరాలను నోట్ చేసుకోవాలని మెడికల్ షాపులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 

 

వాస్తవానికి ప్రస్తుతం ప్రయివేట్ ఆస్పత్రులన్ని క్లోజ్ చేశారు.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మాత్రమే ఓపీ సేవలు కొనసాగుతున్నాయి.. ఈ నేపథ్యంలో ఎవరికైనా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వస్తే.. నేరుగా మెడికల్ షాపులకు వెళ్ళి  మందులు కొనుక్కుంటున్నారు.. అయితే మెడికల్ షాపులకు వచ్చి దగ్గు, గొంతు నొప్పి, జ్వరం కోసం మెడిసిన్ తీసుకుంటే వెంటనే వాళ్ళ వివరాలు నోట్ చేసి.. ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలని ప్రభుత్వం చెబుతుంది.


 
ఇప్పటికే తెలంగాణాలో ఫీవర్ సర్వేలెన్స్ నడుస్తోంది.. అయితే మెడికల్ షాపుల వద్దకు వచ్చే జనం వివరాలు తెల్సుకుంటే కచ్చితంగా కరోనా లక్షణాలున్న వాళ్ళను గుర్తించ వచ్చు అనే ఆలోచనలో ఉంది సర్కార్.. మెడికల్ షాపుల వాళ్ళు ప్రతిరోజూ సాయంత్రం ఆ రోజు మెడిసిన్ తీసుకున్న వాళ్ల వివరాలను ప్రభుత్వానికి సమర్పిస్తారు.. వెంటనే ప్రభుత్వం నుంచి వాళ్ళకు కాల్ సెంటర్ ద్వారా కాల్ చేసి ఆరోగ్య పరిస్థితులను తెల్సుకుంటారు.. కరోనా లక్షణాలు ఉంటే వెంటనే క్వారంటైన్ కు తరలించి.. టెస్టులు నిర్వహిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: