ఈ మధ్య కాలంలో ఏదైనా కొత్తగా వస్తే చాలు అది ట్రై చేయడం అందరికీ అలవాటుగా మారిపోతుంది. ఎంత చిత్ర విచిత్రంగా ఉంటే అంత బాగా ట్రై చేస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా ఉన్న విషయం ఏమిటి అంటే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు కరోనా  వైరస్. కరుణ వైరస్...వైరస్ ఎలా వచ్చింది .. కరోనా ఎలా పాకుతుంది... కరోనా  ప్రాణాలను బలి తీసుకుంటుంది.. కరోనా ను  జయించేందుకు దేశ ప్రజలు అందరూ ఏం చేస్తున్నారు. ఇలా ఏం చేసినా ఏం మాట్లాడినా పూర్తిగా కరోనా వైరస్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక కరోనా వైరస్  ఎలా ఉంటుంది అనే దాన్ని శాస్త్రవేత్తలు ఒక పిక్చర్  కూడా విడుదల చేశారు. 

 

 ఇదిలా ఉంటే ఇక్కడ చిన్నారి కరోనా వైరస్ ను ఇమిటేట్ చేసింది. ఎలా ఇమిటేడ్  చేసింది అంటే... హెయిర్ స్టైల్ ద్వారా . మామూలుగానే ఏదైనా కొత్త హెయిర్ స్టైల్ వచ్చిందంటే దానిని ట్రై  చేస్తూ వుంటారు చాలామంది. కొంతమంది చిత్రవిచిత్రమైన హెయిర్ స్టైల్తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారి పోతూ ఉంటారు. కొంతమంది హీరో హీరోయిన్ల సినిమాలో వాడిన హెయిర్ స్టైల్స్ వాడుతూ  ఉంటే ఇంకొంతమంది ఊహకందని  స్టైల్ వాడుతూ ఉంటారు. ఇప్పటి వరకు చాలా మంది జనాలు ఎన్నో రకాల హెయిర్ స్టైల్స్ చూసి ఉంటారు కానీ కరోనా  హెయిర్ స్టైల్ మాత్రం ఎప్పుడు చూసి ఉండరు. 

 


 ఇప్పుడు మీరు చూసిన హెయిర్ స్టైల్ కనీవినీ ఎరుగి ఉండరు . ఇంత కొత్తగా ఎవరూ ఆలోచించరు. ఇంతకీ ఈ హైర్ స్టైల్ పేరు ఏమిటి అంటారా కరోనా  హైర్ స్టైల్ . ప్రస్తుతం ఎంతో మంది కరోనా  వైరస్తో బెంబేలెత్తి స్తుంటే ఇక్కడ ఒక చిన్నారి మాత్రం కరోనా  హెయిర్ స్టైల్ అందరినీ నవ్విస్తూ ఉంది. వైట్ డ్రెస్సులో చిన్నారి అచ్చంగా కరోనా  వైరస్ ఎలా ఉంటుందో అలాగే నాలుగు పిలకలు  వేసుకుని ముఖ్యంగా కరోనా  వైరస్ ఎలా ఉంటుందో అలా వేసుకుంది. దీంతో ప్రస్తుతం ఈ చిన్నారి పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఏదేమైనా ఈ కరోనా హెయిర్ స్టైల్ పై మాత్రం అందరు  భిన్నంగా స్పందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: