శృంగారం విష‌యంలో ఆడ‌, మ‌గ ఇద్ద‌రు సంతృప్తి చెందితేనే మాజా ఉంటుంది. వీరిలో ఎవ‌రో ఒక‌రు సంతృప్తి చెందినా శృంగారంలో అస‌లు మ‌జా ఉండ‌దు. మ‌న‌స్సుల్లో ఇద్ద‌రికి ఎంత కోరిక ఉన్నా కొన్ని విష‌యాల్లో ర‌హ‌స్యం అనేది ఇద్ద‌రిని చిక్కుల్లో ప‌డేస్తుంది. కొద్ది మంది మాత్ర‌మే త‌మ జీవితంలో జ‌రిగిన విష‌యాల‌ను తెర‌చిన పుస్త‌కంలా తెర‌చి ఉంచుతారు. చాలా మంది వీటిని అత్యంత సీక్రెట్‌గా దాచేస్తుంటారు. ఇదిలా ఉంటే భార్య‌, భ‌ర్త‌ల విష‌యంలో స్త్రీలు చాలా సీక్రెట్లు మెయింటైన్ చేస్తార‌ని ఓ సర్వేలో తేలింది. 

 

ముఖ్యంగా స్త్రీలు గ‌తంలో జ‌రిగిన ప్రేమ విష‌యాల‌ను ఏ మాత్రం బ‌య‌ట పెట్ట‌ర‌ట‌. కొంద‌రికి కాలేజ్ డేస్‌లోనే ప్రేమ‌లు న‌డుస్తాయి. అలాగే అబ్బాయిల‌కు కూడా కాలేజ్ డేస్‌లో ప్రేమ‌లు ఉంటాయి. ఈ విష‌యంలో పెళ్ల‌య్యాక అబ్బాయిలు కాస్త తొంద‌ర‌గానే త‌మ ఫ‌స్ట్ ప్రేమ‌ల‌ను, కాలేజ్ ప్రేమ‌ల‌ను భార్య‌ల‌కు చెప్పినా భార్య‌లు మాత్రం ఈ విష‌యంల‌ను త‌మ‌లో తామే దాచేసుకుంటార‌ట‌. మ‌రికొంద‌రు అబ్బాయిలు పెళ్ల‌య్యాక భార్య‌ల‌కు తాము పెళ్లికి ముందు న‌డిపిన శృంగార ర‌హ‌స్యాలు కూడా చెపుతార‌ట‌.

 

అయితే ఈ విష‌యంలో అమ్మాయిలు మాత్రం పెళ్లికి ముందు శృంగార భాగోతాలు భ‌ర్త‌ల‌కు చెప్ప‌ర‌ట‌. అయితే ఈ విష‌యంలో మ‌హిళ‌ల పెళ్లికి ముందు ప్రేమ‌లు, శృంగార ర‌హ‌స్యాలు భ‌ర్త‌ల‌కు తెలిస్తే చాలా అపార్థాలు వ‌చ్చే ప్ర‌మాదం ఉన్నందున వీటిని మీలో మీరు దాచేసుకోవ‌డ‌మే బెట‌ర్ అని కొంద‌రు నిపుణులు చెపుతున్నారు. ఇక పెళ్లికి ముందే ఇప్పుడున్న యువ‌త‌లో చాలా మంది తొలి క‌ల‌యిక‌ను కోరుకుంటున్నారు. పెళ్ల‌య్యాక మాత్రం భార్య‌లు ఈ విష‌యాన్ని ఏ మాత్రం బ‌య‌ట పెట్ట‌క‌పోవ‌డ‌మే మంచిద‌ట‌.

 

చాలా మంది అబ్బాయిలు ఈ విష‌యాలు తెలిస్తే హ‌ర్ట్ అవ్వ‌డంతో పాటు లేనిపోని గొడ‌వ‌లు ఎక్కువుగా జ‌రుగుతున్నాయ‌ట‌. పురుషులు మాత్రం తాము పెళ్లికి ముందే ఏం త‌ప్పు చేసినా క‌ర‌క్టే అన్న ధోర‌ణితో ఉంటారు. అందుకే ఈ విష‌యంలో పురుషుల కంటే స్త్రీలే చాలా ర‌హ‌స్యాలు మెయింటైన్ చేయాల‌ట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: