దేశంలో ఏ ముహూర్తంలో కరోనా ప్రవేశించిందో కానీ... మనిషిని చూస్తే మనిషి భయపడే పరిస్థితి ఏర్పడింది.  ఇప్పటికే సామాజిక దూరం పాటిస్తున్నారు.  ఎవరైనా తుమ్మినా.. దగ్గినా విచిత్రంగా చూస్తున్నారు.. ఒకదశలో ఆ వ్యక్తి ఏదో పాపం చేసిన వారిలా ట్రీట్ చేస్తున్నారు.  కరోనా పుణ్యమా అని ఏదైనా వస్తువు కొనాలన్నా.. తాగాలన్నా భయంతో వణికి పోతున్నారు.  అంతేందుకు బయట డబ్బులు కనిపించినా ముట్టుకోవడానికి భయపడుతున్నారు. 

 

తాాజాగా హర్యానాలోని భోండ్సీ జైలు దారుణం వెలుగు లోకి వచ్చింది.  అందరిపై ఆజమాయిషీ చేస్తూ.. వారి బాగోగులు చూసే వార్డెన్  కి కరోనా పాజిటీవ్ అని తేలింది.  ఇంకేముంది వైరస్‌ విస్తరించకుండా జైలు కాలనీ మొత్తాని అధికారులు శానటైజ్‌ చేశారు. 

 

ఈ మద్య సెలవు పై వార్డెన్ భివానీలోని తన ఇంటికి వెళ్లి వచ్చాడు. అతనికి వైద్య పరీక్షలు నిర్వహించగా అతనికి పాజిటీవ్ అని తేలింది. దాంతో అతన్ని ఐసోలేషన్ వార్డుకి తరలించారు.  అయితే అతను ఎవరిని కలిశాడు.. ఎవరి తో మాట్లాడారు.. అన్న విషయం పై ఆరా తీస్తున్నారు. 

 

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: