ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న విషయం తెలిసిందే. కరోనా విజృంభణతో మన దేశంతో పాటు ఇతర దేశాలు కూడా లాక్ డౌన్ ను ప్రకటించాయి. పలు దేశాలు లాక్ డౌన్ ప్రకటించడంతో ఆ ఎఫెక్ట్ పరోక్షంగా అరబ్ దేశాలపైపడింది. అరబ్ దేశాలు పెట్రోల్, డీజిల్ అమ్మకాల ద్వారానే జీవనం సాగిస్తున్నాయి. ఈ అమ్మకాల ద్వారా వచ్చిన డబ్బుతో కొన్ని దేశాలు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాయి. 
 
మరికొన్ని దేశాలు వాళ్ల విలాసాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నాయి. రోజురోజుకు పెట్రోల్, డీజిల్ వినియోగం భారీగా తగ్గుతోంది. మన దేశంలో కూడా లాక్ డౌన్ అమలు నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ వినియోగం భారీగా తగ్గింది. తాజాగా వెలువడిన ఒక నివేదికలో పెట్రోల్ అమ్మకాలు గతంతో పోలిసే  64 శాతం క్షీణించాయని... డీజిల్ అమ్మకాలు 61 శాతం క్షీణించాయని తేలింది. 
 
మన దేశంలొ పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గినా గ్యాస్ వినియోగం భారీగా పెరిగింది. కమర్షియల్ గ్యాస్ వినియోగం తగ్గిపోయినా, డొమెస్టిక్ గ్యాస్ వినియోగం మాత్రం భారీగా పెరిగింది. విమానాలకు వాడే ఏవియేషన్ టర్బైన్ ఇంజన్ వినియోగం ఏకంగా 94 శాతం పడిపోయింది. ప్రభుత్వం ఉజ్వల పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తూ ఉండటంతో ఎల్పీజీ వినియోగం భారీగా పెరిగింది. 
 
దేశంలో లాక్ డౌన్ నిబంధనలు సడలిస్తే లేదా లాక్ డౌన్ ఎత్తివేస్తే మాత్రమే పెట్రోల్, డీజిల్ వినియోగం పెరిగే అవకాశం ఉంది. దేశంలో కరోనా వేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్రం మే 1వ తేదీన లాక్ డౌన్ విషయంలో మరోసారి కీలక నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. కరోనా ఇదే విధంగా విజృంభిస్తే మరోసారి లాక్ డౌన్ ను పొడిగించినా ఆశ్చర్యం లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.                    

మరింత సమాచారం తెలుసుకోండి: