కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుతో ప్ర‌పంచం మొత్తం యుద్ధం చేస్తోంది. క‌రోనాను అరిక‌ట్టేందుకు ఏదేశ ప్ర‌య‌త్న‌మూ ఆదేశం చేస్తూనే ఉన్నాయి. అయినా ఈ మ‌హ‌మ్మారి లొంగ‌డం లేదు. ఈ దిక్కుమాలిన క‌రోనా ర‌క్క‌సికి మందు లేదు..మాకు లేదు.. నిత్యం వేలాది మందిని భూమండ‌లంపై పొట్ట‌న‌బెట్టుకుంటోంది. దీనిని అంత‌మొందించ‌డానికి లాక్‌డౌన్ ఒక్క‌టే మార్గ‌మా..? అంటే కాద‌న్న స‌మాధానమే చాలామంది శాస్త్ర‌వేత్త‌ల నుంచి వ‌స్తోంది. శాస్త్ర‌వేత్త‌లు ఓవైపు రేయిభ‌వ‌ళ్లు క‌రోనాకు మందు క‌నుగోనేందుకు శ్ర‌మిస్తున్నారు. ఇప్ప‌టికే కొన్ని ప్ర‌యోగాలు స‌క్సెస‌యిన క్లినిక‌ల్ రీసెర్చ్ పూర్తి చేసుకోవాల్సి ఉంది. 

 

అయితే ఎంత‌కాద‌నుకున్న మ‌రో ఆరు నెల‌ల పాటు క‌రోనాకు ఉన్న‌ప‌లంగా మందు అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశమైతే లేదు. నియంత్ర‌ణ మాత్ర‌మే దిక్కు అని చెప్పాలి. ఇక భార‌త్ విష‌యానికి వ‌స్తే గ‌డిచిన వారం రోజులుగా క‌రోనా త‌న విశ్వ‌రూపం చూపుతోంది. రోజూ వెయ్యికి పైగా కేసులు న‌మోదు అవుతున్నాయి. లాక్‌డౌన్ ఎత్తివేస్తే ఎలా అన్న మీమాంస ఇప్పుడు కేంద్ర‌, రాష్ట్రాల్లోనూ నెల‌కొంది. అందుకే తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వమైతే మే7వ‌ర‌కు లాక్‌డౌన్ పొడ‌గించాల‌ని నిర్ణ‌యం తీసుకోవ‌డం ఇప్పుడు మిగ‌తా రాష్ట్రాల‌ను ఆలోచ‌న‌లో ప‌డేస్తోంది. ఇప్ప‌ట్లో లాక్‌డౌన్‌కు స‌డ‌లింపు ఇస్తే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్న‌ట్లేన‌న్న‌ది నిపుణులు అభిప్రాయం.

 

జ‌నానికి తాత్క‌లికంగా ఇబ్బందులు క‌లిగిన‌..ప్రాణాల‌క‌న్నా అదేమంత పెద్ద విష‌యం కాద‌న్న‌ది ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆలోచ‌న‌. వాస్త‌వానికి లాక్‌డౌన్ పొడ‌గింపుపై కొంత‌మందిలో విసుగు ఉన్నా త‌ప్ప‌ద‌ని సీఎం కేసీఆర్ కేబినేట్ స్ప‌ష్టంగా చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. కేంద్ర‌ప్ర‌భుత్వం జారీ చేసిన కొన్ని స‌డ‌లింపు అంశాల‌పై కూడా ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆంక్ష‌లు విధిస్తూనే నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా తెలుస్తోంది. మ‌ధ్యాహ్నం నుంచి కేబినేట్‌లో ఏక‌బిగిన ఇదే విష‌యంపై చ‌ర్చ జ‌ర‌గ‌డం గ‌మ‌నార్హం. అయితే కొంత‌మంది మంత్రులు, ఉన్న‌తాధికారులు ఆర్థిక వ్య‌వస్థ దెబ్బ‌తింటుందేమోన‌న్న అభిప్రాయాన్ని చెప్పిన ముఖ్య‌మంత్రి  ఆ అంశాల‌ను చాలా తేలిగ్గా తీసుకుని ప‌క్క‌న పెట్టేసిన‌ట్లు స‌మాచారం.

 

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: