ప్రస్తుతం ప్రపంచమంతటా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ ఎవరు ఏ పని చేసుకోలేకపోతున్నారు. నెల రోజులకు పైగా లాక్ డౌన్ భారతదేశంలో అమలవుతుండగా... అత్యవసర మెడికల్ దుకాణాలు, కూరగాయలు విక్రయించే నిత్యావసర దుకాణాలు తప్ప అన్నీ మూసివేయబడుతున్నాయి. హెయిర్ కటింగ్ షాపులు కూడా మూసివేయాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. అయితే ఈ సమయంలో బాగా జుట్టు, గడ్డం పెరిగిన వారి పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. గడ్డం అంటే ఎలక్ట్రానిక్ ట్రిమ్మెర్ యూజ్ చేసి షేవ్ చేసుకోవచ్చు. కానీ హెయిర్ కట్ చేసుకోవడం దాదాపు అసాధ్యం అని చెప్పుకోవచ్చు. సో, అందుకే చాలామంది కటింగ్ చేసే బార్బర్ల వద్దకు వెళ్తున్నారు. మరికొంతమంది మాత్రం తన కుటుంబ సభ్యుల సహాయంతో ఎలాగోలా పెరిగిన జట్టు ని కట్ చేసుకుంటున్నారు.


తాజాగా ఒక వ్యక్తి సోషల్ మీడియా వేదికగా తెలంగాణ మంత్రి కేటీఆర్ కు ఒక విన్నపం చేశారు. తాను పెట్టిన పోస్టులో... ' సార్ నా భార్య నాకు హెయిర్ కటింగ్ చేయాలనుకుంటుంది. ఒకవేళ అదే గనుక జరిగితే నేను లాక్ డౌన్ లిఫ్ట్ చేసిన తర్వాత కూడా బయటకి రాలేను', అంటూ పేర్కొన్నాడు. అయితే ఈ పోస్ట్ కి రిప్లై ఇచ్చిన కేటీఆర్.. విరాట్ అంతటివాడే తన భార్య అనుష్క శర్మతో కటింగ్ చేయించుకున్నాడు. నువ్వు కూడా చేయించుకుంటే పోలా" అని హాస్యాస్పదంగా స్పందించారు. అయితే ఇవన్నీ ఇలా సరదాగా మాట్లాడుకోవడానికి బాగానే ఉంటుంది కానీ నిజంగానే ఎవరైనా కటింగ్ షాప్ లకు లేక చాలామందికి కటింగ్ చేసే వారి వద్దకు వెళితే తప్పకుండా కరోనా వైరస్ సోకుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


అమెరికాలో నమోదైన కరోనా పాజిటివ్ కేసులలో 50 శాతం మంది బార్బర్ షాప్ కి వెళ్లి వచ్చిన వారే నట. ప్రతి ఒక్క కటింగ్ షాప్స్ లలో టవల్స్, కత్తెర్లు, రేసర్లు, కుర్చీ లాంటివి ఉంటాయి. అవన్నీ అందరికీ వాడుతుంటారు క్షవరం చేసే వారు. అయితే ఒకవేళ బార్బర్ షాప్ కి వచ్చే వారిలో ఒక్కరికి కరోనా వైరస్ సోకినా అది అందరికీ వ్యాప్తి చెందే అవకాశం ఉంది. అందుకే ప్రతి ఒక్కరు తమ జాగ్రత్తలలో తాము ఉండాలని భారతీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ కటింగ్ చేపించుకోవాలి అనుకున్నా... మీకు బాగా తెలిసిన బార్బర్ ని ఇంటికి రప్పించుకొని... మీ సొంత టవల్ తో, కొత్త బ్లేడు, రేజర్ల తో హెయిర్ కట్టింగ్ చేయించుకొండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: