శృంగారం అనేది ఇద్ద‌రి మ‌ధ్య ఉన్న తృప్తి.. కేవ‌లం స్వ‌ల్ప కాలిక కోరిక‌లు తీర్చుకునేందుకు ఉన్న అవ‌స‌రం అని మాత్రమే కాదు ఇది ఇద్ద‌రి మ‌ధ్య దాంప‌త్య జీవితానికి సంబంధించింది అన్న విష‌యం ప్ర‌తి ఒక్క‌రు గుర్తు పెట్టుకోవాలి. శృంగారం అనే ప‌దానికి చాలా అర్థాలు ఉన్నాయి. భాగ‌స్వామ్యంలో ఒక‌రి అభిప్రాయాల‌ను మ‌రొక‌రు గౌర‌వించుకోవ‌డం ద‌గ్గ‌ర నుంచి అనేక అంశాలు దీనితో ముడిప‌డి ఉన్నాయి. చాలా మంది శృంగారం అనేది కేవ‌లం శారీర‌క, లైంగీక వాంచ‌లు తీర్చుకునే అవ‌స‌రంగానే చూస్తూ ఉంటారు. అయితే చాలా త‌ప్పు అని సెక్జాల‌జిస్టులు చెపుతున్నారు. 

 

అయితే శృంగారం అనే ప‌దానికి పెళ్లియ‌న కొత్త‌లోనూ.. ఆ త‌ర్వాత అర్థాలు మారుతూ ఉంటాయ‌ని కూడా కొంద‌రు చెపుతున్నారు. ఇది నిజం కూడా.. శృంగారం మీద పెళ్లికి ముందు... పెళ్ల‌యిన కొత్త‌లోనూ... పెళ్ల‌య్యి పిల్ల‌లు పుట్టాక‌.. పిల్ల‌లు పెద్ద‌వారు అయ్యాక కోరిక‌లు, ఆస‌క్తులు మారుతూ ఉంటాయి. ఇవి ఎప్పుడూ కొన్ని జంటల్లో ఒకేలా ఉంటాయి. వీరు నిజంగానే అదృష్ట వంతులు అని చెప్పుకోవాలి. శృంగారాన్ని కొంద‌రు ఏదో హ‌డావిడిగా కానిచ్చేస్తూ ఉంటారు. ఇలా ఎప్పుడూ చేయ‌కూడ‌దు. 

 

దీనిని దాంప‌త్య జీవితంలో పోల్చి చూసిన‌ప్పుడే శృంగారాన్ని ప‌రిపూర్ణంగా అనుభ‌వించ‌వ‌చ్చ‌ని నిపుణులు చెపుతూ ఉంటారు. అయితే పెళ్లికి ముందు కోరిక‌లు అణుచుకోలేని వారు... శృంగారంపై ఆస‌క్తి ఉన్న వారు నీలి చిత్రాలు చూస్తూ ఉంటారు. వీరు పెళ్ల‌య్యాక త‌మ జీవితం ఇలా లేదేంట‌ని నిరాశ‌కు గుర‌వుతూ ఉంటారు. ఇక అంగ ప్ర‌వేశానికి ముందు భాగ‌స్వామి స‌హాయం అవ‌స‌రం అన్న‌ది కూడా ఇద్ద‌రూ తెలుసుకోవాలి. ఇక సంతానం విష‌యంలో లేట్ కావాల‌నుకునే వారు గ‌ర్భం రాకుండా ఉండేందుకు ముందుగా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. లేక‌పోతే అనేక అనార్థాలు.. అపార్థాలు వ‌స్తాయి. అర్థ‌వంత‌మైన సంబంధాల‌తోనే అప్యాయ‌త‌లు, అనురాగాలు ఉంటాయ‌న్న‌ది తెలిసిందే. ఇక శృంగారాన్ని తేలిక‌గా తీసుకునే వారి దాంప‌త్య జీవితం కూడా అంత బ‌లంగా ఉండ‌ద‌ని అంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: