ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య మరింత పెరిగిపోయింది. 24 గంటల్లో ఏపీలో కొత్తగా 44 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ఏపీ సర్కారు తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు మొత్తం 647 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వివరించింది.  ఇదిలా ఉంటే... తూర్పుగోదావరి జిల్లాలో కరోనా సోకిన వారి సంఖ్య 24కు చేరింది. ఆదివారం ఒక్క రోజే రాజమండ్రిలో 5 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రాజమండ్రి మంగళవారంపేటలో కరోనా సోకిన 28 ఏళ్ల వివాహిత కుటుంబ సభ్యుల్లో మరో ఐదు మందికి కూడా కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది.

 

దీంతో రాజమండ్రి మంగళవారంపేటను అధికారులు రెడ్ జోన్‌గా ప్రకటించారు.  ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో అత్యధికంగా 158 కేసులు నమోదు కాగా, వారిలో 153 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. ఆ జిల్లాలో ఇప్పటివరకు నలుగురు మృతి చెందగా, ఒకరు కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని ప్రభుత్వం చెప్పింది. 

 

 ఇదిలా ఉంటే..  రాజమండ్రితో పాటు కాకినాడ, పెద్దాపురం, పిఠాపురం, కత్తిపూడి, కొత్తపేటలోని రెడ్ జోన్ల పరిధిలో 32 వేల కుటుంబాలు,  లక్షా 20 వేల మంది ప్రజలు భయంతో వణికిపోతున్నారు. జిల్లాలో 469 కరోనా అనుమానితుల ఫలితాలు వెల్లడికావాల్సి ఉంది. మరోవైపు  జిల్లాలో ఆరుగురు ఆస్పత్రి నుంచి డిస్సార్జి అయ్యారు. జిల్లాలో కరోనా సోకిన ఇద్దరు విశాఖలో చికిత్స పొందుతున్నారు. 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: