దేవుడు లేని దేశంలో పుట్టిన కరోనా దెయ్యంలా ప్రపంచం మీదకు దండెత్తింది. కరోనా గుప్పిట్లోకి ప్రపంచం మెల్లగా వెళ్ళిపోతోంది. ఇక మన దేశంలో చూసుకుంటే కరోనా గత నెల రోజులుగా దూకుడు ప్రదర్శిస్తోంది.

 

అయితే కొన్ని చోట్ల కరోనాకు బ్రేకులు పడుతున్నాయి. గట్టి షాకులు కూడా తగులుతున్నాయి. కరోనా వైరస్ విషయం చూసుకుంటే ఈ దేశంలో 720 జిల్లాలకు గానూ సగం పైగా జిల్లాలలో దాని ఉనికీ జాడా లేదంటే నమ్మశక్యం కాదు కానీ నిజం. అదే విధంగా మొత్తం 28 రాష్ట్రాలు ఉంటే పదకొండు రాష్ట్రాల్లోనే కరోనా ప్రబలంగా ఉంది.

 

ఆ విధంగా చూస్తే మూడవ వంతు మాత్రమే ఈ దేశంలో కరోనా ఉందనుకోవాలి. ఇక్కడ చూస్తూంటే అనేక ఆసక్తికరమైన అంశాలు కూడా వెలుగు చూస్తున్నాయి. వేల సంవత్స‌రాల చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక కేంద్రం, పురాతన నగరం వారణాసిలో కరోనా కేసులు ఒక్కటి కూడా నమోదు కాకపోవడం షాక్ లాంటిదే.

 

కరోనా నేపధ్యంలో లాక్ డౌన్ విధించాక దేశం నలుమూలల నుంచి అప్పటిఏ వచ్చిన అనేకమంది కాశీలో చిక్కుకుపోయారు. అయినా కూడా ఒక్క అనుమానిత కేసు కూడా నమోదు కాకపోవడాన్ని బట్టి చూస్తూంటే కరోనాని మహా శివుడు తన త్రిశూలం పెట్టి ఆపేశాడని భక్తజనం నమ్ముతున్నారు.

 

అంతే కాదు, దేశంలో ఉన్న జ్యోతిర్లింగాలలో కూడా ఎక్కడా కరోనా కేసులు ఇంతవరకూ నమోదు కాలేదుట. మరి ఇది కదా దేవుడి దెబ్బ అంటున్నారు. మహాశివుడు మూడవ కన్ను తెరిస్తే ఈ దేశం నుంచే కరోనా మటుమాయం కావడం ఖాయమని అంటున్నారు.

 

మరి భారత దేశం నిండా దేవుళ్ళు ఉన్నారు. ఇది ఆధ్యాత్మిక గడ్డ. ఎందరో దేవుళ్ళు పుట్టిన నేల. అలాగే ఎందరో స్వామీజీలు, మహనీయులు పుట్టి నడయాడిన గడ్డ. అందువల్ల ఈ దేశంలో కరోనా మహమ్మారి వీర విహారం చేయడం కష్టమని కూడా ఆస్తిక జనులు గాఢంగా నమ్ముతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: