మందులేని కరోనా వైరస్ ని కట్టడి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం మార్చి 22 నుండి లాక్ డౌన్ అమలులోకి తీసుకు రావటం అందరికీ తెలిసిన విషయమే. లాక్ డౌన్ నీ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పగడ్బందీగా కట్టుదిట్టంగా అమలు చేయడం జరిగింది. మొదట ఏప్రిల్ 14 దాకా అనుకున్నా కానీ కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో మే 3 వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు కేంద్రం చెప్పుకొచ్చింది. దీంతో దేశంలో అన్ని రంగాలు యధావిధిగా క్లోజ్ అయిపోయి ఉన్నాయి. దేశ ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావడంతో పరిశ్రమలు అన్నీ కూడా మూతపడి పోవడంతో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థికంగా నష్టాలు రావడం జరిగాయి. అత్యవసర మరియు నిత్యవసర మినహా అన్ని రంగాలు క్లోజ్ అయిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్రం ఆర్థికంగా బాగా నష్టపోవడం జరిగింది.

 

ఇటువంటి టైములో మళ్లీ ఎకానమీ ఉంచుకోవడం కోసం కేంద్రం సడలింపు లతో కొత్త మార్గదర్శకాలు అమలులోకి తీసుకు రావడం జరిగింది. ఏప్రిల్ 20 తర్వాత కొన్ని రంగాలకు సడలింపు ప్రకటించిన కేంద్రం..టోల్ ఫీజు వసూలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎన్‌హెచ్ఏఐ, కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మధ్య అంతర్గతంగా చర్చలు జరిగాయి. ఈ క్రమంలోనే ఏప్రిల్ 20 నుంచి హైవేలపై ఉన్న టోల్ గేట్ల వద్ద ఫీజు వసూలు చేయాలని నిర్ణయానికి వచ్చింది.

 

దీంతో ఎకానమీ మళ్లీ రైజ్ అయ్యే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇదేవిధంగా రాష్ట్రాల మధ్య వాహన రాకపోకలు పై ఉన్న నిషేధాన్ని కూడా ఎత్తివేస్తూ కేంద్ర హోం శాఖ ఇటీవల ఆదేశాలు ఇవ్వటంతో టోల్ ఫీజు వసూలు ఎన్ హెచ్ ఐ ప్రారంభించాలని కేంద్ర రోడ్డు రవాణా శాఖ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ నిర్ణయంతో ఇండియన్ ఎకానమీ రన్నింగ్ షురూ అవ్వటం గ్యారెంటీ అని ఆర్థిక నిపుణులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: