దేశంలో కరోనా వైరస్ మొట్టమొదటిసారిగా ప్రవేశించింది కేరళ రాష్ట్రంలో. కేరళ రాష్ట్రంలో మొట్టమొదటి పాజిటివ్ కేసు నమోదు కావడంతో దేశం మొత్తం అలర్ట్ అయింది. ఆ తర్వాత అనేక పాజిటివ్ కేసులు దేశవ్యాప్తంగా నమోదు అవుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించడం జరిగింది. ప్రస్తుతం చాలా రాష్ట్రాలలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఊహించని విధంగా నమోదవుతున్నాయి. ఢిల్లీ మత ప్రార్థనల ఎఫెక్ట్ వల్ల దేశంలో అనేక పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇటువంటి తరుణంలో కేరళలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మొదటిలో ఎలా నమోదు అయ్యాయో… రికవరీ విషయంలో అదేవిధంగా దూసుకుపోతుంది.

 

దేశంలో వైరస్ రికవరీ విషయంలో కేరళ రాష్ట్రాన్ని మించింది మరొకటి లేదు. గత వారం రోజుల నుండి కేరళ రాష్ట్రంలో అతి తక్కువగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇటువంటి తరుణంలో కేరళ ప్రభుత్వం గట్స్ ఉండే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అదేమిటంటే రాష్ట్రవ్యాప్తంగా ప్రణాళికబద్ధంగా యధావిధిగా పనులు పునరుద్ధరించేందుకు సరికొత్త నిర్ణయాలను తీసుకుంది. ఈ సందర్భంగా రాష్ట్రాన్ని నాలుగు జోన్లుగా కేరళ ప్రభుత్వం విధించింది.  వీటిని రెడ్‌, ఆరెంజ్-ఏ, ఆరెంజ్-బీ, గ్రీన్ జోన్లుగా విధించడం జరిగింది. ఈ నేపథ్యంలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లా ను రెడ్ జోన్ గా గుర్తించి నాలుగు జిల్లాలను కేరళ ప్రభుత్వం చేర్చింది.

 

ఈ జోన్ లో నిత్యవసర వస్తువుల పంపిణీ తప్ప.. ఇక్కడ ఎలాంటి వెసులుబాట్లకు అనుమతి ఇవ్వకుండా నిర్ణయం తీసుకుంది. ఇక ఆరెంజ్ బీ జోన్ లో ప్రజల రోజువారీ కార్యకలాపాలకు అనుమతులు ఇవ్వడం జరిగింది. ఇక గ్రీన్ జోన్ లో యధావిధిగా కార్యకలాపాలు నడవనున్నాయి. అంతేకాకుండా రాత్రి 7 గంటల వరకు రెస్టారెంట్లో భోజనం చేసుకోవడానికి అనుమతి ఇస్తూ 8 వరకు పార్సిల్ తీసుకునే వెసులుబాటు కల్పించారు. అత్యవసర సేవలు నిర్మాణ పనులు వ్యవసాయ సంబంధమైన రంగాలకు అనుమతి ఇచ్చారు. ఇక ప్రార్థన మందిరాలు, సామూహిక వేడుకలు, షాపింగ్ మాల్, విద్యాసంస్థలు, సినిమా థియేటర్లపై నిషేధం అలాగే ఉంచింది. పక్కా ప్రణాళికతో కరోనా వైరస్ కట్ట విషయంలో కేరళ సర్కార్ ముందు నుండి వ్యూహాత్మకంగా వెళుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: