ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కు కారణం చైనా అన్న సంగతి ప్రపంచానికి తెలిసిందే. ఆ దేశం కావాలనే ఇలా వైరస్ ను ప్రపంచంపైకి వదిలిందన్న అనుమానాలు ఉన్నాయి. ఈ మేరకు అమెరికా వంటి దేశాలు పరిశోధన కూడా ప్రారంభించాయి. చైనా పై కేసు పెట్టి పరిహారం కోరాలని అమెరికా భావిస్తోంది కూడా.

 

 

అయితే ఇంతలో ఓ ఇండియన్ లాయర్ చైనాకు షాక్ ఇచ్చేశాడు. కరోనా వైరస్ వ్యాప్తికి కారణమైన చైనాపై అంతర్జాతీయ న్యాయ స్థానంలో కేసు వేశాడని వార్తలు వస్తున్నాయి. ముంబై కి చెందిన ఒక న్యాయవాది కూడా భారత్ కు 190 లక్షల కోట్ల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అంతర్జాతీయ న్యాయ స్థానంలో కేసు వేశాడట. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ పాకేందుకు చైనాయే కారణమన్నది అతని ఆరోపణ.

 

 

ఈ మొత్తం దారుణానికి చైనాయే కారణమంటూ ఆశిష్ సొహనీ అనే లాయర్ అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు లో కేసు వేశారు. చైనా దేశం తమ దేశంలో పుట్టిన కరోనాను కంట్రోల్ చేయకపోగా అన్ని దేశాలకు వ్యాపించేలా చేసిందంటూ ఆశిష్ సొహనీ చైనా పై ఆరోపణలు చేశారు. మొత్తం 33 పేజీల పిటిషన్ ను లాయర్ ఆశిష్ దాఖలు చేసినట్టు తెలుస్తోంది.

 

 

ఈ కరోనాను కట్టడి చేయడం కోసం ఇండియా ఎంత తిప్పలు పడుతోందో అందరికీ తెలుసు. రోజూ లక్షల కోట్ల రూపాయలు నష్టపోతూ ప్రజల ప్రాణాలు కాపాడుకునేందుకు లాక్ డౌన్ విధించింది. ఇలా చైనా కారణంగా భారత్ తీవ్రంగా నష్టపోయిందని ఆశిష్ సొహనీ వాదిస్తుతన్నారు. ఇందుకు భారత్ కు చైనా రూ. 190 లక్షల కోట్లు పరిహారంగా చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని ఐసీసీని ఆశిష్ సొహనీ కోరాడు. మరి ఈ కేసు ఏమవుతుందో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: