దేశమంతటా లాక్ డౌన్ నడుస్తోంది. అయితే ఈ లాక్ డౌన్ సమయంలోనూ నిత్యావసరాలు, ఇతర అత్యవసర సేవలకు మాత్రం లాక్ డౌన్ వర్తించదని నిబంధనలు చెబుతున్నాయి. కానీ వాస్తవానికి ఈ నిబంధనలు చాలా చోట్ల అమలు కావడం లేదు. దేశమంతటా అన్ని రాష్ట్రాలు ఒకే విధానం పాటించడం లేదు. దీని వల్ల రాష్ట్రాల సరిహద్దులు దాటి వెళ్లే వాళ్లుకు ఇబ్బందులు వస్తున్నాయి.

 

 

ఉదాహరణకు.. చేపల ఎగుమతులు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఈశాన్య రాష్ట్రాలకు చేపలు పెద్ద ఎత్తున ఎగుమతి అవుతాయి. భీమవరం, ఆకివీడు, కైకలూరు ప్రాంతాల నుంచి ప్రతీరోజు సుమారు 200 లారీల్లో చేపలు అసోం, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్, పశ్చిమబెంగాల్, బిహార్, మేఘాలయ, త్రిపుర, మిజోరం తదితర రాష్ట్రాలకు ఎగమతి అవుతాయి. ఇటీవల కూడా ఆక్వా ఎగుమతులకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అనుమతులివ్వడంతో భీమవరం పరిసర ప్రాంతాల నుంచి పలు లారీలు అసోం బయల్దేరాయి. వాటిని అసోం సరిహద్దుల్లో ఆపేశారు.

 

 

దీంతో రాష్ట్ర చేపల ఎగుమతిదారుల సంఘం ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఆయన ప్రత్యేకంగా చొరవ తీసుకుని ఆ రాష్ట్ర సీఎంతో చర్చించారు. దీంతో అసోం సరిహద్దుల్లో నిలిచిపోయిన చేపల లోడు లారీలు ముందుకు కదిలాయి. లారీలు అసోంలోకి ప్రవేశించాయి. దీంతో రాష్ట్ర చేపల ఎగుమతిదారుల సంఘం సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపింది.

 

 

 

రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో బిహార్, పశ్చిమబెంగాల్‌ తదితర రాష్ట్రాలకు పెద్ద మొత్తంలో చేపల ఎగుమతులు అవుతున్నాయని రాష్ట్ర చేపల ఎగుమతిదారుల సంఘం ఆనందం వ్యక్తం చేస్తోంది. మొత్తానికి సమస్య పరిష్కారం కావడంతో చేపల ఎగుమతి దారుల్లో సంతోషం వ్యక్తమవుతోంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: