కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం ప్రపంచం అంతా ఎదురు చూస్తోంది. మందులేని ఈ మహమ్మారిని ఎదుర్కోవటం విషయంలో కేవలం నియంత్రణ మాత్రమే ఏకైక మార్గం కావటంతో దేశాలు లాక్ డౌన్ ప్రకటించడం జరుగుతున్నాయి. దీంతో చాలా వరకు ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఏర్పడింది. పేదవాళ్లు మరియు సామాన్యులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం రాత్రింబవళ్లు బాగా కష్ట పడుతున్నారు. అనేక ప్రయోగాలు చేస్తున్నారు. ఇప్పటికే చాలా చోట్ల సక్సెస్ అయినట్లు అంతర్జాతీయ స్థాయిలో వార్తలు వస్తున్నాయి.

 

ఇదిలా ఉండగా ప్రఖ్యాతి యూనివర్సిటీ ఆక్సఫర్డ్ వర్సిటీ వ్యాక్సినోలజీ ప్రొఫెసర్ సారా గిల్బర్ట్ ఇటీవల బంగారం లాంటి వార్త చెప్పారు. వచ్చే నెలలో కరోనా వైరస్ వ్యాక్సిన్ ని ప్రయోగించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తొలిదశలో ఈ వ్యాక్సిన్ నమూనాను 18 నుంచి 55 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారిపై ప్రయోగిస్తున్న ట్లు చెప్పుకొచ్చారు. చేస్తున్న ప్రయోగాలు సక్సెస్ వస్తే వచ్చే అక్టోబర్ నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. అక్టోబర్ అంటే కచ్చితంగా మనకి దసరా పండగ వచ్చేసింది.

 

దీంతో ప్రపంచమంతా మన దసరా కోసం ఎదురు చూస్తుంది అని చెప్పవచ్చు. కచ్చితంగా అప్పుడుగాని వ్యాక్సిన్ రిలీజ్ అయితే మాత్రం మునుపటి ప్రపంచంలో మనిషి ఏవిధంగా బతకటం జరిగిందో ఆ విధంగా బతికే రోజులు ముందు ఉన్నాయని చెప్పవచ్చు. ప్రస్తుతం జరుగుతున్న అన్ని పరిశోధనలలో ఆక్స్ ఫర్డ్ వర్సిటీ వ్యాక్సినోలజీ ప్రొఫెసర్ సారా గిల్బర్ట్ చేస్తున్న ఫలితాలు కూడా సత్ఫలితాన్ని వచ్చేవి లాగా ఉన్నాయని చాలామంది అంటున్నారు. 

 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple.

మరింత సమాచారం తెలుసుకోండి: