ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నింటితో పాటుగా భారతదేశంలో కూడా లాక్ డౌన్ చాలా పటిష్టంగా కొనసాగుతోంది. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు మనదేశంలోని వాణిజ్య-వ్యాపార-వర్తక రంగాలు పూర్తిగా మూతబడ్డాయి. మిగతా అనీ సేవలు కూడా స్తంభించాయి. కేవలం అత్యవసర సేవలు మాత్రమే కొనసాగుతున్న నేపథ్యంలో వివిధ సంస్థలకు మరియు రంగాలకు చెందిన ఉద్యోగులు ఇంకా ఇతర సిబ్బంది 'వర్క్ ఫ్రొం హోమ్' చేస్తున్నారు. ఇంటి వద్దనే ఉండి వారి ఆఫీసులో చేయవలసిన పని అంతా ల్యాప్ టాప్స్ ద్వారా కానిచ్చేస్తున్నారు.

 

ఇక రోజుల్లో వై-ఫై కనెక్టివిటీ చాలా అత్యవసరమైన సేవగా మారిన నేపథ్యంలో ఐటిలతో సహా ఇతర రంగాల్లోని ఉద్యోగులకు ఎటువంటి ఆటంకం మరియు అంతరాయం లేకుండా వారి పనులన్నీ ఎప్పటికప్పుడు జరిగిపోతున్నాయి. కరోనా వైరస్ వెళ్లిపోయాక లాక్ డౌన్ ఎత్తివేశాక వర్క్ ఫ్రం హోమ్ఇక అనేది కొత్త ప్రామాణికంగా మారుతుందని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. కరోనా వెళ్లిపోయాక ప్రపంచం మరోలా రూపాంతరం చెందుతుందని పేర్కొన్నారు. ఇంటి నుంచి పని చేసే కొత్త ప్రామాణికం పుట్టుకొస్తుందని వెల్లడించారు.

 

అయినా ఇది మన మంచికే కదా ట్రాఫిక్ సమస్యలు ఉండవు ఆఫీస్ కి లేటుగా వెళ్తున్నామని గొడవ ఉండదు బాస్ లేదా మేనేజర్ చివాట్లు తోటి ఉద్యోగులతో గొడవలు మనస్పర్థలు రావు... ఎంతైనా మన ఇంట్లోనే కూర్చొని ప్రశాంతంగా నచ్చిన పని చేసుకుంటూ ఉంటే కిక్కే వేరు. భారతదేశంలో అన్ని రంగాలకు వర్క్ ఫ్రం హోమ్ పద్ధతి తెలిసేలా చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కావున రాబోయే రోజుల్లో మనం వ్యాపారం ఇంక ఉద్యోగాలను కొత్త కోణంలో చూడడం ఖాయంగా కనిపిస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: