ప్రపంచవ్యాప్తంగా 23,67,758 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధరణయ్యాయి. 1,62,070 మంది మృతిచెందారు. ఇకపోతే విచిత్రంగా లాక్‌డౌన్ నిబంధనలకు వ్యతిరేకంగా బ్రెజిల్‌లోనూ నిరసనలు తెలుపుతున్నారు. బ్రెజిల్ నగరాల్లో వందలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆంక్షలకు ముగింపు పలకాలని డిమాండ్ చేశారు.

 

భారత్ లో కరోనా మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. మహారాష్ట్రలో కరోనా కరాళ నృత్యం చేస్తున్నది.   రాష్ట్రంలో ఇంత వరకూ మూడు వేల మూడువందల 23 మందికి కరోనా సోకింది. భారత్‌లో గత 24 గంటల్లో కొత్తగా 1324 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 31 మంది మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 16,116కి పెరిగింది.

 

తెలంగాణలో ఇప్పటివరకు 858 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.. ఆదివారం కొత్తగా 18 కేసులు నమోదయ్యాయి. ఇంతవరకు 21 మంది మరణించారు.. 186 మంది కోలుకుని డిశ్చార్జయ్యారు. ప్రస్తుతం 651 మంది చికిత్స పొందుతున్నారన్నారు.

 

ఏపీలో కొత్తగా 44 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన  కేసుల సంఖ్య 647కు చేరింది. ఒక్క కర్నూలు జిల్లాలోనే కొత్తగా 26 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం వెల్లడించింది.

 

కృష్ణా జిల్లాలో 6, తూర్పుగోదావరి జిల్లాలో 5, గుంటూరు జిల్లాలో 3, అనంతపురం జిల్లాలో 3 కొత్త కేసులు నిర్థరణ అయినట్లు హైల్త్ బులెటిన్ లో వెల్లడించింది. మమమ్మారి కారణంగా 201 మంది మృత్యు ఒడికి చేరారు.

 

ప్రంపంచ వ్యాప్తంగా కరోనా కేసుల జోరు స్థిరంగా ఉంది. కానీ వ్యాపార రంగాలు తీవ్రంగా నష్టపోయాయి. ఒక్క అమెరికాలోనే 10 లక్షాల ఉద్యోగాలు పోయాయి. భారత దేశంలో శనివారంతో పోలిస్తే ఆదివారం 50% తక్కువ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో కేసులలో పెరుగుదల కనిపించగా.. ఆంధ్రలో పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: