కెనడా దేశంలో గత 30 సంవత్సరాల్లో ఎన్నడూ జరగని అతి కిరాతకమైన ఘటన ఆదివారం నాడు చోటు చేసుకొని అక్కడి ప్రాంత ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తుంది. ఓ అగంతకుడు పోలీసు యూనిఫామ్ ధరించి, తన కారును కూడా రాయల్ కెనడియన్ పోలీస్ క్రూయిజర్ గా తయారుచేసి నోవా స్కోటియా రాష్ట్రంలోని ప్రజలపై తుపాకీతో పెద్ద విధ్వంసానికి పాల్పడ్డాడు.


స్థానిక పోలీసులు చెప్పిన ప్రకారం అతని పేరు గాబ్రియేల్ వోర్ట్‌మన్, వయస్సు 51 సంవత్సరాలు. ఎందుకు ఇప్పటి వరకు తెలియరాలేదు కానీ తన తుపాకీతో ఏకంగా 16 మంది తో సహా ఒక మహిళా పోలీస్ కానిస్టేబుల్ ని అతి కిరాతకంగా చంపేశాడు. ఈ ఘోరమైన విషయాన్ని తెలుసుకున్న స్థానిక పోలీసులు హుటాహుటిన నిందితుడిని ఛేదించి హాలిఫాక్స్ వెలుపల ఎన్ ఫీల్డ్ గ్యాస్ స్టేషన్ వద్ద పట్టుకున్నామని ప్రకటించారు. కానీ కొంత సమయం గడిచిన తర్వాత అతను మరణించాడని పోలీసు అధికారులు తెలిపారు. ఎలా మరణించాడు అనేది మాత్రం అధికారికంగా తెలపలేదు.


నోవా స్కోటియా ఉన్నత అధికారి మాట్లాడుతూ... 'ఈ దాడి చాలా ఖండించదగినది. దీనిని బుద్ధిలేని హింసాత్మక చర్యగా నేను భావిస్తున్నాను. ఈ దాడిలో చనిపోయిన వారిలో ఒక మహిళా కానిస్టేబుల్ కూడా ఉన్నారు. ఆమె పేరు హైడి స్టీవెన్సన్, వయస్సు 23 సంవత్సరాలు. ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. మాస్ షూటింగ్స్ అనేవి కెనడా దేశంలో చాలా అరుదుగా జరుగుతుంటాయి. అప్పుడెప్పుడో 30 ఏళ్ల కిందట అనగా 1989 లో మార్క్ లుపిన్ అనే ఓ దుండగుడు 14 మంది యువతులను అతికిరాతకంగా కాల్చేసి... తాను కూడా కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు' అని ఆయన మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఇటువంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. మృతుల కుటుంబ సభ్యులకు మేము అండగా ఉంటాము. గడ్డు పరిస్థితుల్లో వారికి ఏ లోటు లేకుండా చూసుకోవడానికి చర్యలు చేపడతాము' అని కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రుదేఉ రాతపూర్వకంగా తెలియజేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: