గురువు కరోనా మహా ఖత్ర్నాక్‌గా ఉంది.. ఇది వచ్చి ఇంత మందిని చంపింది.. ఇంతటితో ఊరుకుంటుందా అంటే అదీలేదు.. దొంగలా దాక్కుంటూ మరీ వేటాడుతుంది.. అదెలా అంటే ఓ వ్యక్తి దుబాయి నుంచి  28 రోజుల కిందట వచ్చాడు. ఇతను విదేశాల నుంచి రావడంతో అధికారులు అతడిని క్యారంటైన్‌ కేంద్రానికి తరలించిన 23 రోజుల తర్వాత కూడా ఎలాంటి కరోనా లక్షణాలు కనిపించలేదు. అయితే ఇటీవల అతడు స్వల్ప అస్వస్థతకు గురవగా.. మరోసారి పరీక్షలు నిర్వహించగా అతడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అయితే ఈ వ్యక్తిలో ఇంత ఆలస్యంగా వైరస్‌ వెలుగు చూడటం అధికారులను ఆలోచనలో పడేసింది.

 

 

చూసారుగా కరోనా ఎన్ని నక్కజిత్తుల వేశాలు వేస్తుందో.. ఇలాంటి సమయంలో లాక్‌డౌన్ కనుక ఎత్తివేస్తే ఉన్నపళంగా ప్రజలందరు సేఫ్ కారు.. ఎందుకంటే ఈ వైరస్.. ఎటు నుండి దాడి చేస్తుందో తెలియదు.. ఎవరి వల్ల వ్యాపిస్తుందో అర్ధం కాదు.. అది సినిమా ధియోటర్స్‌లోనా.. షాపింగ్ మాల్స్ లోనా.. సూపర్ మార్కెట్స్ నుండా.. మెడికల్ షాప్‌ల నుండినా.. ఇలా ఏరకంగా మనుషులకు సోకుతుందో అర్ధం కాదు.. ఎందుకంటే ఇది అంత త్వరగా బయటపడటం లేదు.. ఈ వైరస్ పలాన వాడిలో ఉంది అని బయటపడే సమయానికి అతని ద్వార ఓ పదిమంది వరకు వ్యాపిస్తుంది.. ఆ పది మంది ఈ సంఖ్యను పెంచుకుంటూ పోతారు.. కాబట్టి కరోనా అనేది అంత తేలికగా తీసివేసే వైరస్ కాదు.. అందుకే రాబోయే రోజుల్లో కూడా ఎవరితో కలవాలన్నా, మాట్లాడాలన్న భయపడుతూ ఉండవలసి వస్తుంది..

 

 

ఎందుకంటే ఒక వ్యక్తికి వచ్చిందంటే కుటుంబం మొత్తం క్యారంటైన్‌ కేంద్రాని వెళ్లవలసి వస్తుంది.. ఇదిలా ఉండగా ఇప్పటికే చాలామంది ఉపాధి అవకాశాలు కోల్పోయారు.. అందులో మానవాళికి కావలసిన నిత్యావసర సరకులను అందించే ప్రతివారికి తీవ్ర నష్టం జరిగింది.. జరుగుతుంది.. ఇక నిరుద్యోగం పెరిగింది.. ఇంకా పెరుగుతుంది.. ఇక భవిష్యత్తుకు పూర్తి భద్రత లోపించింది.. మధ్యతరగతి, నిరుపేద కుంటుంబాల బ్రతుకులు ఇప్పటికే అంధకారంలోకి వెళ్లి పోయాయి.. కుటుంబాన్ని పోషించుకోలేక కొందరు ఆత్మహత్యల వైపు చూపుసారించే అవకాశాలుండగా.. మరికొందరు దొంగలుగా అవతారం ఎత్తే అవకాశాలు కూడా ఉన్నాయి..

 

 

ఇప్పటికే ఆర్ధికమాంధ్యం ముప్పు ముంచుకొస్తుంది.. మరి వీటన్నీటికి కాలమే సమాధానం చెప్పాలి.. ఇకపోతే కరోనాకు వ్యాక్సిన్ వస్తే గాని ఈ వ్యాధిని పూర్తిగా జయించినట్లు కాదు.. మరి ఇలాంటి సమయంలో పరిస్దితులను ఈ వైరస్ ఎక్కడి వరకు తీసుకెళ్లుతుందో అర్ధం కాదు.. ఇంకా ఎన్ని నరకాలు చూపిస్తుందో తెలియదు.. అందుకని మనందరం ఇప్పుడే అమ్మయ్య అని సంబరపడిపోవడానికి వీలులేదు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: