అధిక బరువు ఉన్న వారికి కరోనా వైరస్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తాజాగా వెల్లడించిన స్టడీస్ లలో తేలింది. ఊబకాయులకు గుండె జబ్బులు, షుగర్ వ్యాధులు రావడం తో పాటు ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కోవిడ్ 19 వ్యాధి కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తాజా పరిశోధనలో తేలింది. కరోనా వైరస్ సోకిన రోగులు అధిక బరువు ఉంటే వారి ప్రాణాలకు అధిక ముప్పు ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు.


బాడీ మాస్ ఇండెక్స్ అనే ఒక సూచిక ప్రకారం వయసుకు, ఎత్తుకు... తగ్గ బరువు లేకుండా దాని కంటే అత్యధికంగా బరువు కలిగిన వారికి ఎక్కువ ప్రాణ హాని కలుగుతుందని ఆక్స్ఫర్డ్ జర్నల్ ఆఫ్ క్లినికల్ ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ పరిశోధన కేంద్రం వెల్లడించింది. న్యూయార్క్ లోని ఒక ప్రముఖ హాస్పిటల్లో మూడు వేల మంది పైచిలుకు కోవిడ్ 19 వ్యాధిగ్రస్తులు అడ్మిట్ కాగా... వారిలో ఇరవై ఒక్క శాతం మంది ఎక్కువ బరువు కలిగి ఉండగా... ముప్పై ఒక్క శాతం మంది అత్యధికంగా లావు ఉన్నారని తెలిసింది.


ఊబకాయం అనగా అత్యధిక బరువు ఉన్నవారిలో కూడా 27 శాతం మంది ఐసీయూలో చికిత్స పొందుతుండగా... 12 శాతం మంది చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. వాస్తవానికి మనం ఇప్పటి వరకు 60 సంవత్సరాలు పైబడిన వారు మాత్రమే కోవిడ్ 19 వ్యాధికి ఎక్కువగా మృత్యువాత పడతారని భావించాం. కానీ ఏ వయసువారైనా ఊబకాయం లాంటి అనారోగ్య సమస్యలు కలిగి ఉంటే వారి ప్రాణాలకు కచ్చితంగా ముప్పు ఉంటుంది. అమెరికాలో ఎక్కువమంది ఒబేసిటీ అనారోగ్య సమస్యలతో గుండెజబ్బుల బారినపడి మృత్యువాత పడుతున్నారు. ఇకపోతే న్యూయార్క్ లో ఇప్పటి వరకు రెండు లక్షల నలభై రెండు వేల మంది కరోనా వైరస్ బారిన పడగా వారిలో 18 వేల మంది మరణించారు. ఏదేమైనా అధిక బరువు ఉన్నవారు కాస్త జాగ్రత్తగా ఉండటం ఎంతైనా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: