పాకిస్థాన్ లో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. గడచిన 24 గంటల్లో పాక్ లో 514 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్న నమోదైన కేసులతో కలిపి కేసుల సంఖ్య 7,993కు చేరింది. ఇప్పటివరకు 159 మంది కరోనా భారీన పడి ప్రాణాలు కోల్పోగా కేసుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. గత నెలలో జరిగిన మత సదస్సు వల్ల ఇక్కడ అధిక సంఖ్యలో కేసులు నమోదయ్యాయని తెలుస్తోంది. 
 
తాజాగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ట్వీట్ ద్వారా తన కడుపుమంటను వెల్లగక్కారు. భారత్ లో ప్రధాని మోదీ విజృంభిస్తున్న కరోనాను కట్టడి చేయకుండా ముస్లింలను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. వేలాదిమంది ముస్లింలను కేంద్రం లక్ష్యంగా చేసుకుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనివల్ల వేలాది మంది చిక్కుల్లో పడ్డారని పేర్కొన్నారు. ఇలా లక్ష్యంగా చేసుకోవడం మోదీ ప్రభుత్వ జాత్యాహంకారానికి నిదర్శనం అని అన్నారు. 
 
ఇమ్రాన్ ఖాన్ మోదీపై, భారత ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. పాక్ లో గత నెలలో జరిగిన మత సదస్సు కేసులను ప్రభుత్వం ఇంకా ట్రేస్ చేయలేదని సమాచారం. అధికారులే ఈ విషయాలను స్వయంగా వెల్లడించడంతో ఆ దేశ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. దీంతో కరోనా ఎంతమందికి సోకిందో అర్థం కాక అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. 
 
ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం ఘాటుగా స్పందించింది. కరోనాను కట్టడి చేయలేక పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని.... పాక్ లో కరోనా బారిన పడిన వారికి ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించలేక విఫలమవుతోందని.... ఇతర దేశాలపై లేనిపోని ఆరోపణలు చేసే బదులుగా సొంత దేశ ప్రజలను ఆదుకోవాలని కేంద్ర విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. గతంలో కూడా ఇమ్రాన్ ఖాన్ పై భారత్ పై అనేకసార్లు మాటల దాడికి దిగిన విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: