ప్రస్తుతం అగ్రరాజ్యంగా చెప్పబడుతున్న అమెరికా కరోనా దెబ్బకి అతలాకుతలం అయింది అని చెప్పవచ్చు. దీనికి కారణం అక్కడ నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసులు. ప్రస్తుతానికి ఆ దేశంలో కరుణ కేసులు 8 లక్షలకు కాస్త అటు ఇటుగా సంఖ్య చేరింది. ప్రస్తుతానికి అమెరికా దేశంలో ఖచ్చితంగా అంటే ఏడు లక్షల అరవై మూడు వేలు ఉన్నాయి. ఇక నిన్న ఆదివారం ఒక్కరోజే అక్కడ 1539 కరోనా దెబ్బకు ప్రాణాలు వదిలారు.


ఇక అలాగే నిన్న ఒక్కరోజే 25 వేల కేసులు నమోదయితే అక్కడ. నిన్నటివరకు అమెరికాలో మొత్తానికి 40, 553 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాదు దీని వల్ల అమెరికాలో ప్రస్తుతం డబ్బులు ఉన్న తినలేని పరిస్థితి ఏర్పడింది అంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందొ అర్థం చేసుకోవచ్చు. నిజానికి వారికి అక్కడ తిండి దొరక్క చాలా ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పవచ్చు. ఇది ఎక్కువగా న్యూయార్క్, టెక్సాస్ లలో ఎక్కువగా కనిపిస్తోంది. నిజానికి వీరు తిండి కోసం ఏకంగా కిలోమీటర్ల మేర క్యూలో నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. లాక్ డౌన్ తీవ్రంగా ఉండడంతో అక్కడ ఎటువంటి ఆహార పదార్థాలు వాళ్లకు దొరకట్లేదు. ఆకలి కేకలతో అమెరికాలో ఇప్పుడు జనం చచ్చిపోయే స్థితికి వచ్చారు అంటే పరిస్థితి ఎంత అద్దం పడుతుందో అర్థం అవుతుంది. నిజానికి లాక్ డౌన్ దెబ్బకి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా మూతపడటంతో ఈ పరిస్థితి నెలకొంది.


నిజానికి చాలా మందికి ఉద్యోగాలు పోవడంతో చేతిలో డబ్బులు సరిగా లేవు. వీరి పరిస్థితి ఇలా ఉంటే చేతినిండా డబ్బులు ఉన్నా సరే ఇప్పుడు తినలేని పరిస్థితి ఏర్పడింది. వ్యాపారం మూత వేయడంతో రెండు కోట్ల మందికి పైగా రాత్రికి రాత్రి ఫుడ్ బ్యాంకులో వైపు చూడని వాళ్ళు కూడా ఇప్పుడు వాటి కోసం క్యూలు కడుతున్నారు. మంగళవారం పెన్సిల్వేనియాలోని గ్రేటర్ పిట్స్బర్గ్ కమ్యూనిటీ ఫుడ్ బ్యాంకు దగ్గర అ వేలాది మంది జనం బారులు తీరారు. అంతేకాకుండా దేశంలో కరోనా ఎక్కువ ప్రభావిత రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితే ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. కరోనా దెబ్బకి న్యూయార్క్ శవాల దిబ్బగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: