ప్రపంచం ఎంత టెక్నాలజీతో ముందుకు సాగుతున్నా.. వాటి మూలాలను ఎప్పుటికీ గుర్తంచుకోవాలి.  ముఖ్యంగా ఎంటర్ టైన్ మెంట్ విషయానికి వస్తే.. ఒకప్పుడు మూకీ చిత్రాలతో మొదలైన ప్రస్తావన ఇప్పుడు వ్యూజువల్ వండర్స్ తో అబ్బుర పరుస్తున్నారు.  కెమెరాతో ఒకప్పుడు ఫోటోలు అంటే ఎంత గొప్ప ప్రాధాన్యత ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు టెక్నాలజీ పూర్తిగా మారిపోయింది.. స్మార్ట్ ఫోన్లు వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరి చేతిలో కెమెరాలు.. ఫోటోలు, వీడియోలతో ఊదరగొడుతున్నారు.  ఆధునిక టెక్నాల‌జీ అందుబాటులోకి వ‌చ్చిన త‌ర్వాత మ‌ల్టీ డైమ‌న్ష‌న్ లో దృశ్యాల‌ను బంధించే కెమెరాలు వచ్చిన సంగ‌తి తెలిసిందే.

 

ఇప్పుడైతే త‌మ కెమెరాల్లో ఎన్నో ర‌కాల వన్య‌ప్రాణుల ఫొటోల‌ను చిత్రీక‌రిస్తున్నారు.  ఎన్ని ఫోటోలు వచ్చినా.. ఒకప్పుడు బ్లాక్ అండ్ వైట్ ఫోటోలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందన్న విషయం తెలిసిందే. థామస్ ఈస్ట‌ర్నీ అనే ఫొటోగ్రాఫ‌ర్ 1850లో ఇట‌లీలో ఈ ఏనుగును ఫొటో తీశాడు. డాగ్‌యెర్రియాటైప్ (తొలి క‌మ‌ర్షియ‌ల్‌ ఫొటోగ్రాఫిక్ విధానం) ద్వారా ఈ ఫొటోను చిత్రీక‌రించారు. ఇది ఆసియలోనే మొట్టమొదటి ఏనుగు ఫోటో అంటున్నారు. లూయిస్ డాగ్‌యెర్రే అనే ఫ్రెంచి ఆర్టిస్ట్, ఫొటోగ్రాఫ‌ర్ ఈ విధానాన్ని తొలిసారి ప్ర‌వేశ‌పెట్టాడు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: