వెల్లుల్లి మీరం...తెలుగువారికి ముఖ్యంగా పాత‌త‌రం వారికి దీని ప్ర‌త్యేక‌త ఏమిటో బాగా తెలుసు. నేటికి చాలా మంది జ‌లుబు, ద‌గ్గు, చివ‌రికి జ్వ‌రానికి కూడా దివ్య ఔష‌ధంగా భావిస్తుంటారు. వంటింట్లోనే ల‌భించే గొప్ప మందుగా చెప్ప‌వ‌చ్చు. ముఖ్యంగా జ‌లుబుకు, ద‌గ్గుకు ఇది తిరుగులేని ఆహారపు ఔష‌ద‌మ‌నే చెప్పాలి. వెల్లుల్లిని, ఉప్పు, కారంతో క‌లిపి క‌చ్చ‌ప‌చ్చ‌గా రోట్లో దంచి..వేడివేడి అన్నంతో క‌లిపి తింటే ఆ రుచే వారు. నిజంగా అద్భుతః అన‌ని వాళ్లు ఉండ‌రంటే అతిశేయోక్తి కాదు. తీవ్రమైన ద‌గ్గును ఇది నివారిస్తుంది. కాస్త ఘాటుగా ఉండేలా చూసుకోవాలి. ఇక జ‌లుబు అయితే వెంట‌నే ప‌రార్ అవుతుంది.


ఇప్ప‌టికీ ఎంతో మంది జ్వ‌రం వ‌చ్చిన సంద‌ర్భాల్లో ఎల్లిపాయం కారంతో తిన‌డం మ‌న‌కు క‌నిపిస్తు ఉంటుంది. వైద్యులు కూడా ఎల్లిపాయ కారంతో తిన‌మ‌ని చెబుతుంటారు. కేవ‌లం, జ‌లుబు, ద‌గ్గు నివార‌ణ‌కే కాదు..ఆరోగ్యానికి బ‌హుముఖ ప్ర‌యోజనాల‌ను చేకూరుస్తుంద‌ని వైద్యులు చెబుతుంటారు. గుండె సంబంధిత వ్యాధులు, షుగ‌ర్ రోగంతో బాధ‌ప‌డేవారికి ఎంతో మేలు చేకూరుస్తుంద‌నే చెప్పాలి. ర‌క్తాన్ని శుధ్ది చేస్తుంది, అలాగే శ‌రీరంలోని అద‌న‌పు కొవ్వును త‌గ్గించేస్తుంది. ఇక ఆక‌లిని సైతం పెంచుతుంది. అందుకే పూర్వం రోజుల్లో నిష్టంగా వారంలో ఒక‌రోజు ఏదైనా ఒక‌పూటైనా ఎల్లిపాయ మీరంతో తినేవార‌ట‌.


అందుకే వారు త‌క్కువ‌గా జ‌బ్బు ప‌డేవార‌ని చెబుతుంటారు. ఇక కామోద్దీప‌న‌కు కూడా ఎల్లిపాయ ఎంతో బాగా ప‌నిచేస్తుంద‌ని సెక్స్ ఆరోగ్య‌ వైద్యులు చెబుతున్నారు.మగ‌వారిలో ప‌టుత్వం పెర‌గ‌డ‌మే కాకుండా ఎక్కువ‌సేపు భాగ‌స్వామిని తృప్తి ప‌రిచేందుకు 
దోహ‌దం చేస్తుందంట‌. ఇదిలా ఉండ‌గా ఆదివారం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ ఎల్లిపాయ మీరం యొక్క ప్రాధాన్యం గురించి ప్ర‌స్తావించారు. ఎం లేకున్నా..ఎల్లిపాయం మీరం వేసుకుని తిని బ‌త‌క‌వ‌చ్చ‌ని చెప్పిన విష‌యం తెలిసిందే. బ‌తికుంటే బ‌లుసాకు తినైనా బ‌త‌క‌వ‌చ్చు...అన్న కేసీఆర్ మాట‌ల‌తో చాలామంది నెటిజ‌న్లు దీనిగురించి తెలుసుకున్నారు. ఇప్పుడు ఎల్లిపాయ మిరం వంతు అన్న‌మాట‌.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: