ప్రపంచ వ్యాప్తంగా కరోనాతో చాలా దేశాలు తీవ్రమైన యుద్దాన్నే చేస్తున్నాయి.. ఒకవైపు ఆ దేశ ప్రజల ప్రాణాలు.. మరో వైపు ముంచుకొస్తున్న ఆర్ధిక మాంధ్యం.. దాదాపు ఆన్ని దేశాల ముందు ఉన్న పెను సవాల్.. దీన్ని తట్టుకుని ప్రజల ప్రాణాలు కాపాడుతూ.. మరిన్ని సమస్యలు తలెత్తకుండా చూసుకోవలసిన బాధ్యత ప్రభుత్వాలపై పడింది.. ఒకరకంగా దేశాన్ని పాలించే పాలకులకు ఇది అగ్నిపరీక్ష లాంటిది.. ఇకపోతే ఇప్పుడున్న పరిస్దితుల్లో ప్రపంచ దేశాలు ఒకరికి ఒకరు తోడుగా, సాయంగా ఉంటున్నాయి.. మరికొన్ని దేశాలు కరోనాతో పోరాడుతున్న దేశాలకు సంఘీభావం తెలుపుతున్నాయి.. ఇలాంటి పరిస్దితుల్లో స్విట్జర్లాండ్ కరోనాతో పోరాడుతున్న దేశాలు త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ విన్నూతంగా మద్దతు ప్రకటిస్తుంది..

 

 

ఇందులో భాగంగా స్విస్‌కు చెందిన లైట్ ఆర్టిస్టు గెర్రీ హాఫ్‌స్టేట్టర్ ఆ దేశంలోని ఆల్ప్స్ పర్వతాలపై వివిధ దేశాలకు చెందిన జెండాలను ప్రదర్శిస్తూ సంఘీభావం తెలుపుతున్నారు. కొవిడ్ 19 పై యుద్ధానికి మద్దతుగా స్విట్జర్లాండ్ ప్రభుత్వం ఈ కార్యక్రమానికి మద్దతు తెలుపుతున్నది. ఈ నేపధ్యంలో కరోనా కోరల నుంచి భారత్ త్వరగా బయటపడుతుందని, దీనికోసం ప్రతి భారతీయుడు భాగస్వామి అయ్యారని ప్రశంసిస్తున్నారు. భారతీయుల్లో మనోధైర్యాన్ని నింపడానికి తమవంతుగా చేస్తున్న ప్రయత్నమని పేర్కొన్నారు.. ఇదిలా ఉండగా కరోనావైరస్‌ వల్ల అమెరికాలో చాలా మరణాలు సంభవిస్తున్నాయి.. వారు చేస్తున్న కరోనా యుద్దానికి మద్దతుగా కొద్దిరోజుల క్రితం, ఆ దేశపు జెండాను ఆల్ప్స్ పర్వత పంక్తిలోని జెర్మాట్ మ్యాటర్‌లైన్ పర్వతంపై లైటింగ్ ద్వారా ప్రదర్శిస్తూ సంఘీభావం తెలిపారు.

 

 

ఇకపోతే ఆ పర్వతంపై అన్ని దేశాల జెండాలను ప్రదర్శించే కార్యక్రమం మార్చి చివరి నుంచి జరుగుతున్నది. తాజాగా భారతీయ జెండాను కూడా ప్రదర్శించారు. త్రివర్ణ పతాకాన్ని ఆల్ప్స్ పర్వతంపై తన లైటింగ్ ద్వారా రెపరెపలాడించారు. కాగా సముద్ర మట్టం నుంచి 14,692 అడుగుల ఎత్తులో ఉన్న మాటర్‌హార్న్ శిఖరం పై కొన్ని అరుదైన సందర్భాల్లో మాత్రమే స్విట్జర్లాండ్ పర్యాటక మంత్రిత్వ శాఖ ఆయా దేశాల జాతీయ పతాకాలతో కూడిన విద్యుద్దీప కాంతులను ప్రసరింప చేస్తుంటుంది. తాజాగా మనదేశ మువ్వన్నెల పతాకాన్ని ప్రదర్శించింది.. ఈ దృష్యాన్ని చూస్తే ప్రతి భారతీయుడి మనసు ఆనందంతో ఉప్పొంగుతుంది.. మరింకెందుకు ఆలస్యం ఈ వీడియోను మీరు చూడండి.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: